Healthy Snacks: సాయంత్రం స్నాక్స్‌లో మిర్చీలు, బ‌జ్జీలు తింటున్నారా? వీటిని ట్రై చేయండి.. ఆరోగ్యం సొంతం చేసుకోండి..

Healthy Snacks: సాయంత్రం అయ్యింది అంటే చాలు ఏదో ఒక స్నాక్ తినాల‌ని మ‌న‌సు త‌పిస్తుంటుంది. మ‌రీ ముఖ్యంగా వ‌ర్షాకాలంలో వేడి వేడిగా బజ్జీలు, మిర్చీలు తినాల‌నిపిస్తుంది. అయితే నూనెల వేయించిన ఇలాంటి ఆహార...

Healthy Snacks: సాయంత్రం స్నాక్స్‌లో మిర్చీలు, బ‌జ్జీలు తింటున్నారా? వీటిని ట్రై చేయండి.. ఆరోగ్యం సొంతం చేసుకోండి..
Evening Snacks
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 19, 2021 | 6:27 AM

Healthy Snacks: సాయంత్రం అయ్యింది అంటే చాలు ఏదో ఒక స్నాక్ తినాల‌ని మ‌న‌సు త‌పిస్తుంటుంది. మ‌రీ ముఖ్యంగా వ‌ర్షాకాలంలో వేడి వేడిగా బజ్జీలు, మిర్చీలు తినాల‌నిపిస్తుంది. అయితే నూనెల వేయించిన ఇలాంటి ఆహార పదార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని జ‌రుగుతుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక మైదా పిండితో చేసిన బోండాలు లాంటివి తీసుకుంటే కడుపంతా డిస్ట్ర‌బ్ అవుతుంది. రుచికి బాగానే ఉన్నా.. ఆరోగ్యం మాత్రం పాడ‌వుతుంది. మ‌రి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచే స్నాక్స్ తీసుకుంటే ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.. అటు సాయకాలం ఆక‌లిని కంట్రోల్ చేసుకోవ‌చ్చు. అలాంటి కొన్ని ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* సాయంకాలం వేడివేడిగా పెనంపై వేయించిన పొట్టుతో కూడిన శ‌న‌గల‌ను తీసుకోవాలి. దీనివ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన శ‌క్తి, పోష‌కాలు అందుతాయి.

* ఇక స్వీట్ కార్న్ ల‌భిస్తే తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. వేడి నీటిలో ఉడ‌క‌పెట్టిన మొక్క జొన్న‌కు కాస్త కారం, ఉప్పు జ‌ల్లుకొని తింటే ఎంతో రుచిక‌రంగా ఉంటుంది. దీనివ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఫైబ‌ర్ ల‌భిస్తుంది.

* సాయంకాలం తీసుకునే స్నాక్స్‌లో డ్రైఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా.. బాదంపప్పు, బ్లాక్‌ రైజిన్స్‌ (నల్ల ద్రాక్ష కిస్మిస్‌), పిస్తా, వాల్‌నట్స్‌, అంజీర్‌ వంటి డ్రై ఫ్రూట్స్ శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. పోష‌కాలు, ప్రోటీన్లు పుష్క‌లంగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

* ఇక పండ్ల‌నుకూడా స్నాక్స్‌లో భాగం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా పండ్ల‌తో త‌యారు చేసిన స‌లాడ్స్ రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి.

* కొబ్బ‌రి నీటిని కూడా తాగే అల‌వాటు చేసుకోవాలి. ఇవి శ‌రీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉంచుతాయి. శరీర కణాలకు ద్రవాలను అందిస్తాయి.

Also Read: Immunity Food: విటమిన్ D ఎక్కువగా ఉండే పదార్థాలు కరోనాను తగ్గిస్తాయా ? అధ్యాయానాలు ఏం చెబుతున్నాయంటే..

Chrysanthemum Tea: ఛాయ్ ప్రియుల కోసం చామంతి టీ తయారీ విధానం .. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

Gas Trouble Remedies: గ్యాస్ స‌మ‌స్య ఎంత‌కూ వ‌దిలిపెట్ట‌డం లేదా.? ఈ సింపుల్ టిప్స్ పాటించ‌డి..