Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarpasana Benefits: భుజం నొప్పితో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా.? స‌ర్పాసం ట్రై చేయండి.. దీంతో ఇంకా ఎన్నో లాభాలు..

Sarpasana Benefits: భార‌తీయ స‌మాజంలో యోగాకు ఎన్నో ఏళ్ల చ‌రిత్ర ఉంది. తాజాగా యోగాపై భార‌తీయుల్లో ఆస‌క్తి మ‌రింత ఎక్కువైంది. యోగా వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలే దీనికి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఎన్నో ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు...

Sarpasana Benefits: భుజం నొప్పితో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా.? స‌ర్పాసం ట్రై చేయండి.. దీంతో ఇంకా ఎన్నో లాభాలు..
Snake Pose Yoga
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 19, 2021 | 6:25 AM

Sarpasana Benefits: భార‌తీయ స‌మాజంలో యోగాకు ఎన్నో ఏళ్ల చ‌రిత్ర ఉంది. తాజాగా యోగాపై భార‌తీయుల్లో ఆస‌క్తి మ‌రింత ఎక్కువైంది. యోగా వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలే దీనికి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఎన్నో ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు యోగాతో చెక్ పెట్ట‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు ఎన్నో ర‌కాల యోగ‌సానాలు అందుబాటులో ఉన్నాయి. అందులో స‌ర్పాస‌నం ఒక‌టి. ఇంత‌కీ స‌ర్పాస‌నం ఎలా చేస్తారు.? దీనివ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలపై ఓ లుక్కేయండి..

స‌ర్పాస‌నం వేసే ప‌ద్ధ‌తి..

ఇందుకోసం ముందుగా బోర్లా ప‌డుకుని రెండు కాళ్లూ ద‌గ్గ‌ర‌గా ఉంచి పాదాలో వెన‌క్కు చాపాలి. అనంత‌రం రెండు చేతుల‌ను వెన‌క్కి మలిచి రెడు చేతుల వేళ్ల‌ను క‌లిపి ఉంచాలి. అనంత‌రం త‌ల‌ను కాస్త పైకి ఉంచాలి. అచ్చంగా పాము రూపంలో అన్న‌మాట‌. అందుకే దీనిని స‌ర్పాస‌నంగా పిలుస్తుంటారు. ఇలా చేసిన త‌ర్వాత శ్వాస తీసుకుంటూ.. ఛాతి భాగాన్ని పైకి ఎత్తాలి. ఇలా ఎంత‌సేపు ఉండ‌గ‌లిగితే అంత సేపు ఉండాలి. ఈ ఆస‌నాన్ని రోజుకు 2 నుంచి 5 సార్లు చేస్తే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది.

స‌ర్పాసనంతో కలిగే లాభాలు..

* భుజాల నొప్పుల‌తో బాధ‌ప‌డేవారికి స‌ర్పాస‌నం ఎంతో మేలు చేస్తుంది. * శ్వాస స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. * పొట్ట కండ‌రాలు గ‌ట్టి ప‌డ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. * జీర్ణ శ‌క్తి మెరుగు ప‌డ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. * స‌ర్పాస‌నం వేయ‌డం వ‌ల్ల శ‌రీరాకృతి అందంగా మారుతుంది. * లివ‌ర్‌, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు ప్ర‌తి రోజూ స‌ర్పాస‌నం వేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. * స‌ర్పాస‌నంతో నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు.

Also Read: Consumption of Milk: పాలు తాగితే మధుమేహం వస్తుందా? డయాబెటీస్ తో ఇబ్బంది పడేవారు పాలు తాగొచ్చా?

International Yoga Day 2021 : ఈ ప్రాణాయామం వేడి నుంచి శరీరాన్ని చల్లబరుస్తుంది.. ట్రై చేయండి మీకే తెలుస్తుంది..

Ayurveda – Curd Benefits: వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు..