Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chrysanthemum Tea: ఛాయ్ ప్రియుల కోసం చామంతి టీ తయారీ విధానం .. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

Chrysanthemum Tea: టీ ని డిఫరెంట్ స్టైల్ లో తయారు చేసిన ఘనత మాత్రం భారతీయలదే.. తలనొప్పి, నీరసం అనిపించిన వెంటనే ఒక టీ తాగితే అన్ని సర్దుకుంటాయి అనే స్టేజ్ లో చాయ్ ప్రియులున్నారు...

Chrysanthemum Tea: ఛాయ్  ప్రియుల కోసం చామంతి టీ తయారీ విధానం .. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
Chamomile Tea
Follow us
Surya Kala

|

Updated on: Jun 18, 2021 | 11:35 AM

Chrysanthemum Tea : విదేశం నుంచి భారత దేశంలోకి అడుగు పెట్టిన టీ .. ఇక్కడ వారి జీవితం లో అతి ముఖ్యభాగమైపోయింది. అయితే ఈ టీ ని డిఫరెంట్ స్టైల్ లో తయారు చేసిన ఘనత మాత్రం భారతీయలదే.. తలనొప్పి, నీరసం అనిపించిన వెంటనే ఒక టీ తాగితే అన్ని సర్దుకుంటాయి అనే స్టేజ్ లో చాయ్ ప్రియులున్నారు. అల్లం టీ , లెమెన్ టీ , బాదం టీ, బ్లాక్ టీ , గ్రీన్ టీ యాపిల్ టీ ఇలా అనేక రకాల టీల గురించి విన్నారు.. అయితే ఈరోజు చాయ్ ప్రియుల కోసం చామంతి తీ తయారీ విధానం .. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఏమిటి చామంతి పూలతో టీ .. విచిత్రంగా ఉంది అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండీ.. చామంతి పూలతో తయారుచేసిన టీ రుచిగా ఉండటం మాత్రమే కాదు. ఆరోగ్యపరంగానూ, సౌందర్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయి.

చామంతి టీ ఎంపిక ఎలా చేయాలంటే..

గడ్డి లేదా సీమ చామంతి పూలతో ఈ టీని తయారుచేస్తారు. చామంతి టీ కొనేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే కల్తీ టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే చామంతి టీ ప్యాకెట్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకుని మంచి కంపెనీవి ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం చామంతి టీ సైతం బ్యాగుల రూపంలో లభిస్తోంది. కాబట్టి మంచి బ్రాండ్ ఎంచుకొంటె అన్ని విధాలా మంచిది.

చామంతి టీ తయారు చేసే విధానం:

ముందుగా గిన్నెలో నీరు తీసుకొని నీటిని బాగా వేడి చేయాలి. నీరు వేడెక్కిన తర్వాత ఆ నీటిలో రుచికి సరిపడే బెల్లం వేయాలి. తర్వాత ఆ మరుగుతున్న నీటిలో కొద్దిగా ఎండబెట్టిన చామంతి పూలను వేసి గిన్నె పై మూత పెట్టి రెండు నుంచి పది నిమిషాల పాటు తక్కువ సెగపై మరగనివ్వాలి. టీ గ్‌గా కావాలంటే ఎక్కువ సమయం మ‌రిగించాలి. మీకు నచ్చిన మోతాదులో రంగు, వాసన వచ్చిన తర్వాత వడపోసి నిమ్మరసం కలిపి టీ తాగాలి. కావాలనుకొంటే.. తీపి కోసం తేనె కూడా కలుపుకోవచ్చు.

చామంతి టీ తాగడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఈ టీలో ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన టీల మాదిరిగా దీనిలో కెఫీన్ ఉండదు. *పని ఒత్తిడిలో ఉన్న వారు ఓ కప్పు చామంతి టీ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. *నిద్రలేమితో బాధపడేవారు చామంతి టీ తాగడం వల్ల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. *బరువు తగ్గాలనుకొనేవారికి సైతం చామంతి టీ మంచి ప్రత్యామ్నాయం. *భోజనం చేసే ముందు చామంతి టీ తాగడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. *నెలసరి సమయంలో చామంతి టీ తాగడం వల్ల పొత్తికడుపులో నొప్పి తగ్గుతుంది. *చామంతి టీ రోజూ తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. * థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చామంతి టీ తాగడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.

అందం,. ఆరోగ్యం విషయంలో ఎన్నో ప్రయోజనాలున్న ఈ వలన కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అలర్జీ ఉన్నతికి ఈ మంచిది కాదు.. అంతేకాదు ఈ టీని రోజుకి ఒకటి కంటే ఎక్కువ సార్లు తాగితే వాంతులు అయ్యే అవకాశం ఉంది. గర్భం దాల్చిన మహిళలు, పాలిచ్చే తల్లులు, రక్తం గడ్డకుండా మాత్రలు ఉపయోగించేవారు చామంతి టీ తాగాలనుకొంటే ముందు వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి.

Also Read: రాత్రి భూతాలు, దెయ్యాలు కోసం వెదికేందుకు అక్కడ హోటల్ కు క్యూ కడుతున్న టూరిస్టులు మోస్ట్ హంటెడ్ హోటల్ గా ఖ్యాతి

`