Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity Food: విటమిన్ D ఎక్కువగా ఉండే పదార్థాలు కరోనాను తగ్గిస్తాయా ? అధ్యాయానాలు ఏం చెబుతున్నాయంటే..

కరోనా రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంది. అయితే మరోవైపు కోవిడ్.. మానవుల జీవన శైలిని మార్చేసింది అనడంలో

Immunity Food: విటమిన్ D ఎక్కువగా ఉండే పదార్థాలు కరోనాను తగ్గిస్తాయా ? అధ్యాయానాలు ఏం చెబుతున్నాయంటే..
Vitamin D Rich Food
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 18, 2021 | 4:34 PM

కరోనా రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంది. అయితే మరోవైపు కోవిడ్.. మానవుల జీవన శైలిని మార్చేసింది అనడంలో సందేహం లేదు. జంక్ ఫుడ్… ఆయిల్ ఫుడ్ తినడం మానేసి.. ఇప్పుడు అందరూ.. రోగ నిరోధక శక్తిని పెంచే సహజ కూరగాయలు పండ్లు ఎక్కువగా తింటున్నారు. విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాదాన్యత ఇస్తున్నారు. అయితే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం కోవిడ్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ డి కొవ్వులో కరిగే పోషకం. ఇది శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అలాగే కరోనాను కట్టడికి ఇప్పుడు దేశం మొత్తం టీకా పంపిణీ చేస్తున్న క్రమంలో.. కోవిడ్ కి కారణమయ్యే.. Sars-CoV-2 అనే వైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు ఈ విటమిన్ డి సహయపడుతుందని.. ఇటీవల పలు అధ్యాయనాల్లో బయటపడింది. అంతేకాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను కూడా నివారించడంలో ఈ విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది.

చికాగో మెడిసిన్ విశ్వ విధ్యాయంలో డాక్టర్ డేవిడ్ మెల్టర్జ్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం విటమిన్ డి లోపం ఉన్నవారికి… విటమిన్ డి పుష్కలంగా ఉన్నవారితో పోలిస్తే.. కరోనా సోకే ప్రమాదం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. 489 మంది రోగులలో కోవిడ్ కు పాజిటివ్ పరీక్షించే ప్రమాదం విటమిన్ డి లోపం ఉన్నవారికి 1.77 రెట్లు ఎక్కువ అని తేలింది. మెల్టర్జ్ మాట్లాడుతూ.. ఆహారంలో తగినంత విటమిన్ డి ఉండడంవలన కరోనా వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం తక్కువగా ఉందని చెప్పారు. మాస్కులు ధరించడం.. ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించడం తర్వాత.. అవసరమైన సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.

దాదాపు పరిశోధన అధ్యయనాల ప్రకారం.. రోజూ విటమిన్ డి పదార్థాలను తీసుకోవడం వలన కరోనా వలన ఏర్పడే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ అందిస్తుంది. అయితే ఇతర అధ్యయనాలు.. కాల్విఫెడియోల్ ప్రకారం విటమిన్ డి ఎక్కువగా ఉండే కరోనా రోగులకు ఐసీయూ వరకు వెళ్లే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. అంతేకాకుండా.. విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఇతర వ్యాధులను కూడా నయం చేస్తుంది. సాల్మన్, ఇతర కొవ్వు చేపలు, గుడ్డు సొనలు, పుట్టగొడగులు, పాలు వంటి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. ఎక్కువగా సూర్య రశ్మి తగడం కూడా మంచిదే.

Also Read: 8 Banks Account Holders : ఈ 8 బ్యాంకుల ఖాతాదారులు జూలై 1 ముందే ఈ పనులు చేసుకోవాలి..! లేదంటే అకౌంట్‌లో డబ్బు జమకాదు..

ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X విక్రయం
ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X విక్రయం
IPL 2025: ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో రికార్డుల మోత..
IPL 2025: ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో రికార్డుల మోత..
కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? ఈ అవకాశం వదులుకోవద్దు..!
కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? ఈ అవకాశం వదులుకోవద్దు..!
సెల్‌ఫోన్ వెలుగు అతని ప్రాణాలు నిలబెట్టింది..!
సెల్‌ఫోన్ వెలుగు అతని ప్రాణాలు నిలబెట్టింది..!
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా? అన్‌బ్లాక్‌ కోసం ఏం చేయాలి
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా? అన్‌బ్లాక్‌ కోసం ఏం చేయాలి
ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయి..
ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయి..
కన్నప్పపై మంచు విష్ణు సంచలన నిర్ణయం.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్
కన్నప్పపై మంచు విష్ణు సంచలన నిర్ణయం.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్
DC vs SRH Preview: వైజాగ్‌లో మరో హైటెన్షన్ మ్యాచ్
DC vs SRH Preview: వైజాగ్‌లో మరో హైటెన్షన్ మ్యాచ్
రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరం..కరెంటు సరఫరా ఎలా అవుతుంది
రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరం..కరెంటు సరఫరా ఎలా అవుతుంది
భారతీయులకు స్మార్ట్‌ఫోన్ మత్తు..రోజుకు ఎన్నిగంటలు వాడుతున్నారంటే?
భారతీయులకు స్మార్ట్‌ఫోన్ మత్తు..రోజుకు ఎన్నిగంటలు వాడుతున్నారంటే?