Gas Trouble Remedies: గ్యాస్ సమస్య ఎంతకూ వదిలిపెట్టడం లేదా.? ఈ సింపుల్ టిప్స్ పాటించడి..
Gas Trouble Remedies: మారుతోన్న కాలానికి అనుగుణంగా ఆహార శైలికూడా మారుతోంది. ఇంటి ఫుడ్‌కు ప్రాధాన్యత తగ్గుతుండడం.. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు వంటి మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారా పదార్థాలు తీసుకోవడం ఇటీవల...
Gas Trouble Remedies: మారుతోన్న కాలానికి అనుగుణంగా ఆహార శైలికూడా మారుతోంది. ఇంటి ఫుడ్‌కు ప్రాధాన్యత తగ్గుతుండడం.. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు వంటి మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారా పదార్థాలు తీసుకోవడం ఇటీవల ఎక్కువై పోయింది. దీంతో చాలా మంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల కడుపులో మంట, కడుపు ఉబ్బరం, ఛాతినొప్పి వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. అయితే మనలో చాలా మంది గ్యాస్ సమస్య వచ్చిందటే చాలు లెక్కలేకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటాం. అయితే ఇంట్లో దొరికి పదార్థాలతోనూ గ్యాస్ సమస్య నుంచి బయటపడొచ్చనే విషయం మీకు తెలుసా? సహజసిద్ధంగా గ్యాస్ సమస్యకు చెక్ పెట్టడానికి ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి ఓసారి చూద్దాం..
* గ్యాస్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం.. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడమే. కాబట్టి ఆహారం జీర్ణం కావడంలో కీలక పాత్ర పోషించే అల్లంను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ ఉదయాన్నే పరగడుపున రెండు టీస్పూన్ల అల్లం రసం సేవించాలి. అల్లం రసం తేనె కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
* గ్యాస్ సమస్యకు చెక్ పెట్టడంలో లవంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. భోజనం తర్వాత ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమలాలి ఇలా చేస్తే గ్యాస్ తగ్గుతుంది.
* సోంపు గింజలను నేరుగా తీసుకోవడం కంటే.. వీటితో డికాషన్ చేసుకొని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
* గ్యాస్ సమస్య తగ్గించడంలో కొబ్బరి నీరు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే ప్రోటీన్లు గ్యాస్ సమస్యను తరిమి కొడతాయి.
* ఒక గ్లాసు నీటిలో టీస్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ బేకింగ్ సోడాలను కలిపి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న తర్వాత తాగాలి ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు.
* ఇక వీటన్నింటితో పాటు.. సమయానికి తినకపోయినా, మసాలాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నా గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది. అంతేకాకుండా.. ఒత్తిడి, ఆందోళన కూడా గ్యాస్ సమస్యకు కారణంగా మారొచ్చు.. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే గ్యాస్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Corona on kids : థర్డ్ వేవ్ వస్తే పిల్లలకు నష్టమా..! వైద్యులు ఏమంటున్నారు?