Curry Leaves Health Benefits: కరివేపాకును ఏరి పారేస్తున్నారా.? అయితే టీ చేసుకోని తాగండి.. ఎన్నో లాభాలు పొందండి.
Curry Leaves Health Benefits: దాదాపు అన్ని వంటల్లో కచ్చితంగా కరివేపాకును ఉపయోగిస్తుంటాం. అందుకే చాలా మంది కరివేపాకు చెట్లను ఇంట్లోనే పెంచుకుంటుంటారు. కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే..
Curry Leaves Health Benefits: దాదాపు అన్ని వంటల్లో కచ్చితంగా కరివేపాకును ఉపయోగిస్తుంటాం. అందుకే చాలా మంది కరివేపాకు చెట్లను ఇంట్లోనే పెంచుకుంటుంటారు. కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే.. వీటిని ఆహారంలో భాగం చేశాఉ. అయితే పేరుకు వంటల్లో కరివేపాకును వేసుకున్నా ఎక్కువ శాతం మంది వాటిని తినకుండా ఏరేస్తుంటారు. అయితే కరివేపాకును కూరల్లో తీసుకోవడానికి ఇష్టపడని వారు.. వాటితో టీ చేసుకొని తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. కరివేపాకు టీ వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూడండి.
* శరీరంలో ఇన్‌ఫెక్షన్లు, వాపులు రాకుండా చేయంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. వీటిలో ఉండే ఫినోలిక్స్ అనే సమ్మేళనాలు మంచి యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో చర్మ కణాలు సురక్షితంగా ఉంటాయి.
* కరివేపాకు ఆకులతో తయారు చేసిన టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడితో సతమతమయ్యే వారు ఈ టీని క్రమం తప్పకుండా తీసుకుంటే ఒత్తిడి చిత్తడి అవుతుంది.
* కరివేపాకు టీని తీసుకుంటే.. జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్యకు చెక్ పెట్టవచ్చు.
* ఉదయం లేవగానే సిక్‌నెస్‌తో సతమతమయ్యే వారు కరివేపాలకు టీని క్రమం తప్పకుండా తాగాలి. ఇలా చేయడం వల్ల.. వాంతులు, వికారం, మార్నింగ్ సిక్‌నెస్ తగ్గుతాయి.
* కరివేపాకు టీ తాగడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ నిరూపించారు. ఇలా తయారు చేసుకోండి.. కరివేపాకు ఆకులను తీసుకొని ముందుగా వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం వాటిని ఒక పాత్రలో నీటిని పోసి బాగా మరిగించాలి. అనంతరం వాటిలో కరివేపాకులు, అల్లం వేసి మరిగించాలి. అనంతరం టీని గ్లాసులో పోసుకొని తేనె లేదా నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Whole Grains: తృణధాన్యాలతో బరువు పెరుగుతారా.. పొట్టు తీయని ధాన్యాలు తింటే ప్రయోజనం ఉంటుందా?