Jackfruit Benefits: ప‌న‌సతో క‌లిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు.. అవేంటో తెలిస్తే ఈ పండును అస్స‌లు వ‌ద‌ల‌రు..

Jackfruit Benefits: ప్ర‌కృతి మ‌న‌కు స‌హ‌జంగా అందించే పండ్ల‌లో ప‌న‌స పండు ఒక‌టి. ఎన్నో మంచి పోష‌క విలువ‌లున్న ఈ పండును ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు అందుతాయి. ప‌న‌స పండులో ఉండే...

Jackfruit Benefits: ప‌న‌సతో క‌లిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు.. అవేంటో తెలిస్తే ఈ పండును అస్స‌లు వ‌ద‌ల‌రు..
Jack Fruit Benefits
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 18, 2021 | 6:34 AM

Jackfruit Benefits: ప్ర‌కృతి మ‌న‌కు స‌హ‌జంగా అందించే పండ్ల‌లో ప‌న‌స పండు ఒక‌టి. ఎన్నో మంచి పోష‌క విలువ‌లున్న ఈ పండును ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు అందుతాయి. ప‌న‌స పండులో ఉండే పుష్క‌ల‌మైన విట‌మిన్లు శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. గ‌తంలో కొన్ని ప్రాంతాల‌కే పరిమిత‌మైన పన‌స పండ్లు ఇటీవ‌ల సూప‌ర్ మార్కెట్ సంస్కృతి పెర‌గ‌డంతో అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించింది. మ‌రి ప‌న‌స పండు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటో ఓసారి తెలుసుకుందామా…

* అల్స‌ర్ స‌మ‌స్య‌ను తగ్గించ‌డంలో ప‌న‌స ఎంతో బాగా ఉప‌యోగప‌డుతుంది. ముఖ్యంగా ప‌న‌స‌లో ఉండే యాంటీ అల్స‌రేటివ్‌, యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అల్స‌ర్‌ను ద‌రిచేర‌నివ్వ‌దు.

* ప‌న‌స‌లో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది. దీని కార‌ణంగా కంటి ఆరోగ్యానికి ప‌న‌స ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా శుక్లాల స‌మ‌స్య‌కు ప‌న‌స‌తో చెక్ పెట్టొచ్చు.

* చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు కూడా ప‌న‌స మంచి ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. వృద్ధాప్య ఛాయ‌లు అయిన చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌డం వంటివాటిని ప‌న‌స‌తో చెక్ పెట్టొచ్చు. చ‌ర్మం నిత్య య‌వ్వ‌నంగా ఉండ‌డంతో పాటు కాంతివంతంగా ఉంటుంది.

* కొవ్వు త‌క్కు, క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉండే ప‌న‌స‌ను ఆహారంలో భాగం చేసుకుంటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ప‌న‌సను తీసుకుంటే మంచి ఫలితం ల‌భిస్తుంది.

* పొటాషియం ఎక్కువ‌గా ఉండే ప‌న‌స హైబీపీని త‌గ్గించ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తుంది. బీపి నియంత్ర‌ణ‌లో ఉండ‌డంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ప‌న‌స అడ్డుక‌ట్ట వేస్తుంది.

* ప‌న‌స పండ్ల‌లో ఫైబ‌ర్ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో జీర్ణ‌క్రియ మెరుగుప‌డ‌డంలో ప‌న‌స కీల‌క పాత్ర పోషిస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు చెక్ పెడుతూ పెద్ద పేగులో పేరుకుపోయే కార్సినోజెనిక్ కెమిక‌ల్స్‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.

Also Read: KTR : తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్ ఇత‌ర రాష్ట్రాల‌కు దిక్సూచిగా నిలుస్తాయి : మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్

Digital Eye Strain: ఎక్కువ గంటలు కంప్యూటర్ వర్క్ చేస్తున్నారా ? కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వాలి..

Old Age Healthy habits: వృద్ధాప్యంలో ఆరోగ్యంగా జీవించడానికి అత్యుత్తమ ఆరు అలవాట్లు.. అవేమిటంటే..