Silver Price Today: దేశంలో పతనమవుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..

Silver rate Today: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలు నిత్యం పెరుగుతూనే వచ్చాయి. అయితే.. బంగారం, వెండి ధరలు

Silver Price Today: దేశంలో పతనమవుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..
Silver Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 19, 2021 | 6:46 AM

Silver rate Today: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలు నిత్యం పెరుగుతూనే వచ్చాయి. అయితే.. బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు పెరుగుతుంటాయి. ప్రపంచంలో అదేవిధంగా దేశంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా.. శనివారం కూడా వెండి ధరలు తగ్గాయి. కిలో వెండికి 1700 రూపాయల మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర 68,600 రూపాయలకు పతనమైంది. తాజాగా తగ్గిన ధరల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,600 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 68,600 గా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.68,600 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.68,600 వద్ద ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో వెండి కిలో రూ.74,000 లు ఉంది. విజయవాడలో వెండి రూ.74,000లు వద్ద కొనసాగుతోంది. కాగా.. దక్షిణాది రాష్ట్రాల్లోనే వెండి ధరలు ఎక్కువగా కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.600మేర తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.660 మేర తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,250 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,250 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,270 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,270 వద్ద కొనసాగుతోంది.

Aso Read:

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగారాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన పంజాబ్ గ్రామాలు.. మసీదుల నిర్మాణానికి సిక్కుల సాయం..