మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన పంజాబ్ గ్రామాలు.. మసీదుల నిర్మాణానికి సిక్కుల సాయం..
Sikh Man Donates Land for Mosque: దేశంలో అక్కడక్కడ వెలుగుచూస్తున్న కలహాల మధ్య పంజాబ్‌లోని మలేర్‌కోట్ల, మోగా జిల్లాల్లోని రెండు గ్రామాలు మతసామరస్యానికి, ఐక్యతకు
Sikh Man Donates Land for Mosque: దేశంలో అక్కడక్కడ వెలుగుచూస్తున్న కలహాల మధ్య పంజాబ్‌లోని మలేర్‌కోట్ల, మోగా జిల్లాల్లోని రెండు గ్రామాలు మతసామరస్యానికి, ఐక్యతకు ఉదాహరణగా నిలిచాయి. కొత్తగా ఏర్పడిన మాలెర్‌కోట్ల జిల్లాలో ఒక సిక్కు వ్యక్తి తన పూర్వీకుల భూమిని.. ముస్లిం కుటుంబాలు మసీదు నిర్మించుకోవడానికి విరాళంగా ఇచ్చాడు. చారిత్రాత్మక పట్టణం మలేర్‌కోట్లను ఇటీవల పంజాబ్‌లోని 23 వ జిల్లాగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ క్రమంలో సిక్కు వ్యక్తి ముస్లింలకు భూమిని ఇవ్వడంపై పలువురు కొనియాడుతున్నారు. దీంతోపాటు.. మోగా జిల్లాలోని భలూర్ గ్రామంలో కూడా సిక్కులు ముస్లింల మసీదు ప్రారంభోత్సవానికి సాయం చేసేందుకు ఏకంగా గురుద్వారా తలుపులనే తెరిచారు. జూన్ 13న గ్రామంలో తమ నివాసానికి సమీపంలో.. మసీదుకు పునాదిరాయి వేడుక నిర్వహించేందుకు ముస్లింలు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ క్రమంలో భారీ వర్షం పడటంతో ముస్లింలంతా.. దగ్గర్లోని గురుద్వారా శ్రీ మత్సాంగ్ సాహిబ్ వద్దకు చేరుకున్నారు. దీంతో అప్పటికప్పుడు గురుద్వారా తలుపులు తెరిచి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని భలూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ పాల సింగ్ తెలిపారు. ఎకరంన్నర స్థలంలో మసీదును నిర్మించడానికి ముస్లిం కుటుంబాలు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయని.. అందుకే వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. అప్పటికప్పుడు వేదికను ఏర్పాటు చేసి, రెండు లక్షల విరాళాలను సేకరించి మసీదు శంకుస్థాపన వేడుకను ఘనంగా నిర్వహించామని పాలా సింగ్ తెలిపారు.
Also Read: