Daare Leda Song: సత్యదేవ్ ‘బ్లఫ్ మాస్టర్’ నుంచి దారే లేదా సాంగ్.. ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం అంటున్న నాని..

నాచురల్ స్టార్ నాని.. అటు హీరోగానే కాకుండా.. ఇటు నిర్మాతగానూ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. వాల్ పోస్టర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి...

Daare Leda Song: సత్యదేవ్ 'బ్లఫ్ మాస్టర్' నుంచి దారే లేదా సాంగ్.. ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం అంటున్న నాని..
Daare Leda

నాచురల్ స్టార్ నాని.. అటు హీరోగానే కాకుండా.. ఇటు నిర్మాతగానూ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. వాల్ పోస్టర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి… ఆ బ్యానర్ పై సూపర్ హిట్ చిత్రాలను నిర్మిస్తున్నడు. ఇప్పటికే అ, హిట్ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించి సక్సెస్ అయ్యాడు నాని. ప్రస్తుతం నాని సమర్పణంలో.. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బ్లఫ్ మాస్టర్. ఇందులో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ రూప హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి దారే లేదా అనే సాంగ్ విడుదలైంది. ఈ పాటను కరోనా మహమ్మారి విజృంబిస్తున్న ఈ క్లిష్ట పరిస్థితులలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా బాధితులకు అండగా ఉంటూ.. వారికి సేవలు చేస్తున్న కోవిడ్ ఫ్రంట్ వర్కర్స్‏కు దారే లేదా స్పెషల్ సాంగ్ ను అంకితం ఇస్తున్నట్లు నాచురల్ స్టార్ నాని ప్రకటించారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ పాటను విడుదల చేశారు నాని.

నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ పై ఈ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. ఈపాటకు కేకే లిరిక్స్ అందించగా.. విజయ్ బులగానిన్ సంగీతం అందించారు. నాని, సత్యదేవ్‌లతో పాటు రూప కడువయుర్‌ కూడా ఈ ‘దారే లేదా’ పాటలో అసోసియేట్‌ అయ్యారు. ఈ క్లిష్ట సమయంలో బయట డాక్టర్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు.. కరోనా సమయంలో తమ కుటుంబాలను వదిలేసి మరీ మన కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది కళ్ల‌కు కట్టినట్లు ఈ పాటలో చూపించారు.

ట్వీట్..

Also Read: Pen Studios: ఐదు భారీ ప్రాజెక్ట్‏లను ప్రకటించిన నిర్మాణ సంస్థ.. మొత్తం రూ.1500 కోట్లకు పైగే..

Vishal: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.. విశాల్‏కు తృటిలో తప్పిన ప్రమాదం..