AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa Crime News : కడప జిల్లాలో దారుణం.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. పారిపోతుండగా పట్టుకున్న గ్రామస్థులు

Kadapa Crime News : మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు వేసిన మృగాళ్ల వైఖరిలో మార్పు

Kadapa Crime News : కడప జిల్లాలో దారుణం.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. పారిపోతుండగా పట్టుకున్న గ్రామస్థులు
Kadapa Crime
uppula Raju
|

Updated on: Jun 19, 2021 | 8:01 AM

Share

Kadapa Crime News : మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు వేసిన మృగాళ్ల వైఖరిలో మార్పు కనబడటం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కడప జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించడం లేదని ఓ యువకుడు యువతి గొంతు కోశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బద్వేల్ మండలం చింతలచెరువు గ్రామంలో చరణ్ అనే యువకుడు శిరీష అనే యువతి గొంతుకోసి చంపేశాడు. తన ప్రేమని ఒప్పుకోలేదని కక్ష పెంచుకున్న కిరణ్ పథకం ప్రకారం శిరీషను హత్య చేశాడు. దాడి అనంతరం పారిపోతున్న కిరణ్‌ని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ దాడిలో చరణ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో చికిత్స పొందుతున్నాడు. చరణ్ పై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా శిరీష బద్వేలు పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతోంది. ఆమె మృతదేహానికి బద్వేల్ లో నేడు పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. శిరీష మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడు చరణ్ కి కఠిన శిక్ష పడాలని శిరీష కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

CBSE 10th Class result 2021: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు ఎప్పుడో తెలుసా..? మరింత క్లారిటీ ఇచ్చిన బోర్డు

PM Narendra Modi : మిల్కా సింగ్ మృతిపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. దేశం గొప్ప క్రీడాకారుడిని కోల్పోయిందని వ్యాఖ్య..

Milkha Singh : 80 రేసుల్లో 77 గెలిచిన మిల్కాసింగ్.. కానీ ఒలంపిక్ కల మాత్రం అలాగే మిగిలిపోయింది..