AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుర్గాదేవి ఆలయంలో ముస్లిం పూజారి.. ఆనాదిగా వస్తున్న ఆచారం.. ఎక్కడో తెలుసా..?

జలాలుద్దీన్ ఖాన్ కుటుంబ సభ్యులు తరతరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఈ రోజు వరకు కూడా ఈ ఆలయంలో ముస్లింలే పూజారులుగా మారారు. దుర్గా దేవిని సేవిస్తున్న తన కుటుంబంలోని 13వ తరం తానేనని జలాలుద్దీన్ తెలిపారు. ఆలయానికి సేవ చేయడం, ఆచార వ్యవహారాలను నడిపించే సంప్రదాయం తరతరాలుగా వస్తున్నది.

దుర్గాదేవి ఆలయంలో ముస్లిం పూజారి.. ఆనాదిగా వస్తున్న ఆచారం.. ఎక్కడో తెలుసా..?
Durga Temple In Jodhpur
Jyothi Gadda
|

Updated on: Apr 19, 2023 | 7:01 AM

Share

దుర్గాదేవి గుడిలో ముస్లిం వ్యక్తి పూజారిగా పని చేయడమేంటని అనుకుంటున్నారా..? అదే ఈ పురాతన దేవాలయం ప్రత్యేకత. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో మారుమూల కొండపై ఉన్న 600 ఏళ్ల నాటి దుర్గామాత ఆలయం చాలా ప్రత్యేకత కలిగి ఉంది.  బోధ్‌పూర్ జిల్లాలోని అటవీ ప్రాంతమైన భోపాల్‌ఘర్‌లో బగోరియా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని ఎత్తైన కొండలపై ఉన్న పురాతన దుర్గా ఆలయం ఉంది. బగోరియా గ్రామంలోని ఎత్తైన కొండపై ఏర్పాటు చేసిన దుర్గా ఆలయానికి చేరుకోవడానికి భక్తులు సుమారు 500 మెట్లు , 11 విజయ్ పోల్స్ దాటితే.. దుర్గాదేవిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే.. ఈ ఆలయంలో తరతరాలుగా ముస్లిం కుటుంబాలు పూజారులుగా వ్యవహరిస్తూ.. దేవతకు ఆరాధిస్తున్నారు.

బగోరియాలోని దుర్గాదేవి ఆలయంలో ప్రస్తుతం జలాలుద్దీన్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి పూజారిగా ఉన్నారు. ఈ దుర్గా దేవాలయంలోని ముస్లిం పూజారి కుటుంబం ..దేవి నవరాత్రుల్లో ఉపవాస దీక్షలు చేస్తూ.. అమ్మవారిని పూజిస్తారు. ఈ కుటుంబంలోని వారే తరతరాలుగా పూజరులుగా ఉంటున్నారు. నవరాత్రుల సమయంలో అమ్మవారి భక్తుడైన ప్రధాన పూజారి ఆలయ ప్రాంగణంలో ఉంటూ.. ఉపవాస దీక్షలు ,భజనలు చేస్తుంటారు. భక్తితో అమ్మవారిని పూజిస్తారు. అయితే, దీని వెనుక పురాతన కథ ప్రచారంలో ఉంది.

వందల సంవత్సరాల క్రితం సింధ్ ప్రావిన్స్‌లో తీవ్రమైన కరువు వచ్చిందట. దీంతో ఆ ప్రాంతంతో నివసించే.. జలాలుద్దీన్ ఖాన్ పూర్వీకులు మరో ప్రాంతానికి వలస వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో అతని పూర్వీకులు ఒంటెల కాన్వాయ్‌తో మాల్వాకు చేరుకున్నారట. అయితే.. దారిలో కొన్ని ఒంటెలు అస్వస్థతకు గురయ్యాయి. ఈ క్రమంలో తన పూర్వీకులకు రాత్రిపూట కలలో దేవి కనిపించి.. సమీపంలోని మెట్ల బావిలో ఉన్న దేవి విగ్రహాన్ని బయటకు తీసి.. అందులోని నీటిని ఒంటెలకు తాగిస్తే.. వాటి రోగం తగుతుందని ఆకాశవాణి చెప్పిందట. ఆ దేవత చెప్పినట్టుగా.. జమాలుద్దీన్ ఖాన్ పూర్వీకులు చేశారట. దీంతో ఒంటెల రోగం పూర్తిగా నయం అయిందనీ.. మన జీవితంలో జరిగిన ఓ అద్భుతంగా జలాలుద్దీన్ ఖాన్ అభివర్ణించారు. ఈ అద్భుతాన్ని చూసిన ఖాన్ పూర్వీకులు ఈ గ్రామంలో ఉండాలని నిర్ణయించుకుంది.

ఇవి కూడా చదవండి

అప్పటి నుంచి వారు ఇక్కడే స్థిరపడిపోయారు.. దుర్గాదేవిని పూజించడం ప్రారంభించారు. జలాలుద్దీన్ ఖాన్ కుటుంబ సభ్యులు తరతరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఈ రోజు వరకు కూడా ఈ ఆలయంలో ముస్లింలే పూజారులుగా మారారు. దుర్గా దేవిని సేవిస్తున్న తన కుటుంబంలోని 13వ తరం తానేనని జలాలుద్దీన్ తెలిపారు. ఆలయానికి సేవ చేయడం, ఆచార వ్యవహారాలను నడిపించే సంప్రదాయం తరతరాలుగా వస్తున్నది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..