Summer: త్వరలో వేసవి సెలవులు..మెజారిటీ తల్లిదండ్రుల్లో ఆందోళన.. ఎందుకంటే
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడవని వారు ఎవ్వరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్లకు ఫోన్ లకు అతుక్కునిపోతున్నారు. అయితే త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తల్లిదండ్రుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఎక్కడ మొబైల్ స్కీన్ కు పిల్లలు పరిమితమైపోతారేమోననే భయం వెంటాడుతుంది.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడవని వారు ఎవ్వరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్లకు ఫోన్ లకు అతుక్కునిపోతున్నారు. అయితే త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తల్లిదండ్రుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఎక్కడ మొబైల్ స్కీన్ కు పిల్లలు పరిమితమైపోతారేమోననే భయం వెంటాడుతుంది. అయితే దీనిపై అమెజాన్ కోసం కాంటర్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించగా అందులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వివిధ నగరాలు, పట్టాణాల్లో 3 నుంచి 8 ఏళ్ల వయసు కలిగిన 750 మంది తల్లిదండ్రులపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. తమ పిల్లలు మొబైల్‌ను చూస్తూ సెలవులు గడిపేస్తారోనని 85 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు మొబైల్ స్కీన్ ను రెండు గంటల కంటే తక్కువగానే చూడాలని కోరుకుంటున్నారు. కానీ అందుకు విరుద్ధంగా 69 శాతం మంది పిల్లలు ప్రతిరోజూ మూడు గంటల కంటే ఎక్కవ సమయాన్ని ఫోన్ వీక్షించేందుకు కేటాయిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. తమ పిల్లలు స్క్రీన్ టైం రెండు గంటలకంటే తక్కువ ఉండాలని మెజారిటీ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కానీ అందుకు విరుద్ధంగా 69 శాతం మంది పిల్లలు రోజూ మూడు గంటల కంటే ఎక్కువ సమయాన్ని ఫోన్ వీక్షించడానికే కేటాయిస్తున్నారని సర్వే ద్వారా వెల్లడైంది. అలాగే 96 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్‌వైపు ఆకర్షితులు కాకుండా ఉండటానికి ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో వెతుకులాడుతున్నారని మరో ఆసక్తికర విషయాన్ని సర్వే వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం