Viral Video: ట్రాఫిక్ రూల్స్ కామన్ పీపుల్స్‌కేనా..? మీకు వర్తించవా..? పోలీసులకు చెమటలు పట్టించిన మహిళలు..
ట్రాఫిక్ రూల్స్ కామన్ పీపుల్స్‌కేనా.. పోలీసులకు వర్తించవా.. అని ప్రశ్నించారు యూపీలోని ఇద్దరు మహిళలు. బైక్‌పైహెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న పోలీసు కానిస్టేబుల్స్‌కు చెమటలు పట్టించారు.
సాధారణంగా మనం బైక్‌పై ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు బండి ఆపి ఏం చేస్తుంటారు. బండి ఆపడమే తరువాయి.. ఠక్కున బైక్ కీ లాగేసుకుంటారు. వెహికిల్ “కీ” తీసుకోవడం చట్టవిరుద్ధం.. కానీ.. అవేం లెక్క చేయరు ట్రాఫిక్ పోలీసులు. సరైన పత్రాలు లేవంటూ వందలకు వందలు చలాన్లు విధిస్తుంటారు. అయితే.. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ట్రాఫిక్ రూల్స్ కేవలం ప్రజలకేనా?.. పోలీసులకు వర్తించవా?.. అని ప్రశ్నించారు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ తల్లీకూతురు. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ భరతం పట్టారు. దానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రెండురోజుల క్రితం తల్లీకూతుళ్లు స్కూటీపై ప్రయాణిస్తున్నారు. ఆ క్రమంలో హెల్మెట్ ధరించని ఇద్దరు పోలీసులను గమనించారు. కొంతదూరం ఆ పోలీస్ వెహికిల్‌ని అనుసరించారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు పోలీసులుహెల్మెట్ లేకుండాపెట్రోలింగ్ చేస్తున్నారు. వారి వెనుక స్కూటీ నడుపుతున్న తల్లీకూతుళ్లిద్దరూ.. వారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని గుర్తించారు. అంతే.. ట్రాఫిక్ రూల్స్ సామాన్యులకు మాత్రమేనా అని పోలీసులను నిలదీశారు.
వీడియో చూడండి..
ऐसे सिटीज़न्स चाहिये pic.twitter.com/izF6zM9OZZ
— MANJUL (@MANJULtoons) April 18, 2023
హెల్మెట్ ధరించకుండా వెహికిల్ నడపడం ఏంటని ప్రశ్నించారు. అయితే.. ఎంత ప్రశ్నించినా ఆ కానిస్టేబుల్స్ మాత్రం.. వారిని పట్టించుకోకుండా బైక్ వేగం పెంచడం విమర్శలకు తావిచ్చింది. ఇక.. ఈ తతాంగాన్ని ఫోన్‌లో బంధించారు తల్లీకూతురు. వాళ్లిద్దరు దాదాపు 1 కిలోమీటరు మేర ఆ కానిస్టేబుల్స్‌ను వెంబడించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో సంబంధిత కానిస్టేబుల్స్ బైక్‌కు వెయ్యి రూపాయలు చలానా విధించారు ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులు. కానిస్టేబుల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంపై ప్రశ్నించిన ఆ తల్లీకూతుళ్లపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..