AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నగా ఉందని వానపాము అనుకుంటే పొరపడినట్టే..! ఈ గుడ్డి పాము ఎంత ప్రమాదకరమైనదంటే..?

మీరు చాలా దగ్గరగా చూస్తే మాత్రమే తెలుస్తుంది ఇది వానపాము కాదని.. దీని శరీరంపై భిన్నంగా ఉండే చిన్న చారలను కలిగి ఉంటుంది. దీని తోక సూటిగా ఉంటుంది. తల దగ్గర రెండు చిన్న మచ్చలు ఉంటాయి. కంటి ప్రాంతం మూసుకుపోయి దాదాపు అంధంగా ఉంటుంది.

చిన్నగా ఉందని వానపాము అనుకుంటే పొరపడినట్టే..! ఈ గుడ్డి పాము ఎంత ప్రమాదకరమైనదంటే..?
Blind Snake
Jyothi Gadda
|

Updated on: Apr 19, 2023 | 8:42 AM

Share

పాము అనే పదం వినగానే శరీరంపై వెంట్రుకలు లేచి నిల్చుంటాయి. ఒక రకమైన భయాందోళన కలుగుతుంది. అయితే, అన్ని పాములు విషపూరితమైనవి కావు, అన్ని పాములు కాటువేయవు. అయినా భయం. వానపాములా సన్నగా ఉండే అతి ఇలాంటి అతి చిన్న గుడ్డి పాము గురించి ఎప్పుడైనా విన్నారా..? పాముల్లో వందల జాతులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 రకాల పాములు కనిపిస్తాయి. అందులో దాదాపు 200 పాములు విషపూరితమైనవి. అయితే, అత్యంత చిన్నదిగా, కనిపించే ఈ గుడ్డి పాము మాత్రం చూసేందుకు వానపాములా కనిపిస్తుంది. కానీ, దీనిని బ్లైండ్ స్నేక్ అంటారు. శాస్త్రీయ భాషలో దీనిని ఇండోటైఫ్లాప్స్ బ్రామినియన్ అంటారు. ఈ పాము ఎక్కడ చూసినా వానపాము అని పొరబడుతుంటారు. దాని కదలిక, రంగు ఒకే విధంగా ఉంటాయి.

మీరు చాలా దగ్గరగా చూస్తే మాత్రమే తెలుస్తుంది ఇది వానపాము కాదని.. దీని శరీరంపై భిన్నంగా ఉండే చిన్న చారలను కలిగి ఉంటుంది. దీని తోక సూటిగా ఉంటుంది. తల దగ్గర రెండు చిన్న మచ్చలు ఉంటాయి. కంటి ప్రాంతం మూసుకుపోయి దాదాపు అంధంగా ఉంటుంది. ఈ పాము ఎలాంటి కాంతిని గుర్తించలేదు. పాము అని తెలిసిన తర్వాత భయపడటం సహజం కానీ, ఈ పాము ఎలాంటిదంటే..

అయితే చాలా పాములు విషపూరితమైనవి అయినప్పటికీ ఈ గుడ్డి పాము ప్రమాదకరం కాదు. చీమలను తింటూ జీవిస్తాయి. ఈ పాములు ఆఫ్రికా, ఆసియాలో కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..