Rabbit: ఓరేయ్ ఎంత పని చేశార్రా..కుందేలు అనుకోని మనిషిని చంపారు
చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. చెట్ల పొదల్లో ఉన్న వ్యక్తిని కుందేలు అనుకొని షూట్ చేయడంతో అతను ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 14న జియాంగ్జి ప్రావిన్స్‌లోని షాక్సీ టౌన్ లో నలుగురు వ్యక్తులు చేపలు పట్టాడనికి వెళ్లారు.
చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. చెట్ల పొదల్లో ఉన్న వ్యక్తిని కుందేలు అనుకొని షూట్ చేయడంతో అతను ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 14న జియాంగ్జి ప్రావిన్స్‌లోని షాక్సీ టౌన్ లో నలుగురు వ్యక్తులు చేపలు పట్టాడనికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న గడ్డిలో కదలికలు గమనించారు. అది కుందేలు అనుకుని ఆ గడ్డి వైపు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వాంగ్ మౌజిన్ అనే వ్యక్తి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనకు కారణమైన నిందితులను అరెస్టు చేశారు.
వాస్తవానికి చైనాలో తుపాకీపై కఠినమైన చట్టాలు. అంతేకాదు బొమ్మ తుపాకీలపై కూడా ఆంక్షలు ఉన్నాయి. అక్కడ వేటాడటానికి అనుమతి ఉంటుంది. కానీ ఎక్కవగా ఆర్మీ, చట్టాలు అమలు చేసేవారికి, భద్రతా సిబ్బందికే తుపాలను పరిమితం చేస్తారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. చైనాలో మనుషులు తుపాకీ కలిగి ఉండటం ఎలా సాధ్యమని చైనా సోషల్ మీడియా యాప్ లో వీబోలో ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇది అమెరికా వార్త అనుకున్నానంటూ మరో నెటిజన్ స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..