AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiktok Challenge: టిక్ టాక్‌లో నిద్రమాత్రలు ఛాలెంజ్.. స్వీకరించి ప్రాణాలు పోగొట్టుకున్న 13 ఏళ్ల బాలుడు

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ టిక్ టాక్ లో బెనాడ్రిల్ అంటే నిద్ర మాత్రలు ఎవరు ఎక్కువ తీసుకుంటారో అన్న ఛాలెంజ్ చక్కర్లు కొడుతోంది. ఈ ఛాలెంజ్ ను జాకబ్ స్టీవెన్స్ తన టిక్ టాక్  స్నేహితులతో  కలిసి ఎవరు ఎక్కువగా స్లీపింగ్ పిల్స్ ను తీసుకోవచ్చో అన్న సవాలులో పాల్గొన్నాడు.

Tiktok Challenge: టిక్ టాక్‌లో నిద్రమాత్రలు ఛాలెంజ్.. స్వీకరించి ప్రాణాలు పోగొట్టుకున్న 13 ఏళ్ల బాలుడు
Benadryl Challenge
Surya Kala
|

Updated on: Apr 19, 2023 | 9:20 AM

Share

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరికీ పాపులర్ పిచ్చి పట్టింది. రకరకాల విన్యాసాలతో సామాజిక మాధ్యమాల ద్వారా పాపులారిటీని, అభిమానులను సంపాదించుకుంటున్న యువతీ యువకులు ఎందరో ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఆదరణ సొంతం చేసుకుని ఓ చిన్న సైజు సెలబ్రెటీగా చెలామణీ అవుతున్న వారు ఎందరో ఉన్నారు. అయితే అమృతం ఎక్కువగా సేవించినా అది  విషంగా మారుతుంది అని అంటారు. అవును కొన్నిసార్లు సోషల్ మీడియాలో రకరాల ఛాలెంజ్‌లు హల్ చల్ చేస్తూ ఉంటారు.  అయితే ఇలాంటి ఛాలెంజ్ లో కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. అతిగా టిక్‌టాక్‌ వినియోగం ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని ఓహియోకు చెందిన జాకబ్ స్టీవెన్స్ (13) అనే మైనర్ బాలుడు టిక్‌టాక్‌లో ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించాడు. ఆ తర్వాత అనారోగ్యం బారిన పడి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స కు స్పందించని ఆ బాలుడు మృతి చెందాడు.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ టిక్ టాక్ లో బెనాడ్రిల్ అంటే నిద్ర మాత్రలు ఎవరు ఎక్కువ తీసుకుంటారో అన్న ఛాలెంజ్ చక్కర్లు కొడుతోంది. ఈ ఛాలెంజ్ ను జాకబ్ స్టీవెన్స్ తన టిక్ టాక్  స్నేహితులతో  కలిసి ఎవరు ఎక్కువగా స్లీపింగ్ పిల్స్ ను తీసుకోవచ్చో అన్న సవాలులో పాల్గొన్నాడు. ఛాలెంజ్‌లో భాగంగా స్టీవెన్స్ 12-14 బెనాడ్రిల్ మాత్రలు తీసుకున్నాడు. అయితే 13 ఏళ్ల బాలుడికి అతను తీసుకున్న నిద్రమాత్రలు ఓవర్ డోస్. దీంతో అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. తమ కొడుకును చూసిన తల్లిదండ్రులు వెంటనే స్పందించి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటూ ఒక వారం తర్వాత చికిత్స ఫలించక బాలుడు మరణించాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?