Language War: దేశంలో మరోసారి ప్రాంతీయం వర్సెస్ జాతీయం..! ఎందుకీ లాంగ్వేజ్‌వార్.. గతాన్ని పరిశీలిస్తే..
సీఎం స్టాలిన్ రాజేస్తున్న భాషా ఉద్యమం ఓ నిప్పురవ్వగానే కనిపిస్తుండొచ్చు. కానీ, దక్షిణాదితో పాటు ఉత్తరాదికి కూడా దావానలంలా వ్యాపించబోతోంది. ఇప్పటికే.. దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు ఈ భాషా గొడవలు జరిగాయి. రెండేళ్ల క్రితం సింగర్ మంగ్లీపై దాడి జరిగింది గుర్తుందా. బళ్లారి ఉత్సవాల్లో పాటలు పాడమని పిలిస్తే వెళ్లారు. ప్రోగ్రామ్‌లో పాటలు పాడింది, అంతా బాగానే జరిగింది. కాని, తిరిగి వెళ్తున్నప్పుడు.. ఉన్నట్టుండి ఆమె కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరో రాళ్లు విసిరారు.

సీఎం స్టాలిన్ రాజేస్తున్న భాషా ఉద్యమం ఓ నిప్పురవ్వగానే కనిపిస్తుండొచ్చు. కానీ, దక్షిణాదితో పాటు ఉత్తరాదికి కూడా దావానలంలా వ్యాపించబోతోంది. ఇప్పటికే.. దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు ఈ భాషా గొడవలు జరిగాయి. రెండేళ్ల క్రితం సింగర్ మంగ్లీపై దాడి జరిగింది గుర్తుందా. బళ్లారి ఉత్సవాల్లో పాటలు పాడమని పిలిస్తే వెళ్లారు. ప్రోగ్రామ్‌లో పాటలు పాడింది, అంతా బాగానే జరిగింది. కాని, తిరిగి వెళ్తున్నప్పుడు.. ఉన్నట్టుండి ఆమె కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరో రాళ్లు విసిరారు. అంతకు ముందు ఆమె మేకప్ టెంట్‌లోకి కూడా జొరబడ్డారు. పోలీసులు లాఠీలు పట్టుకుంటే తప్ప గొడవ సద్దుమణగలేదు. ఇంతకీ.. ఎందుకా గొడవ జరిగిందని ఆరా తీయగా వినిపించిన వర్షన్ ఏంటంటే.. ఆమె కన్నడంలో మాట్లాడకపోవడం. అప్పటి వరకు కన్నడ పాటలే కదా పాడింది అంటే.. నో, అంతటితో సరిపోదన్నారట కన్నడిగులు. ప్రశాంత్‌నీల్ తెలుసుగా.. కేజీఎఫ్, సలార్ డైరెక్టర్. ఉన్నట్టుండి తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేశాడు. కారణం.. ప్రభాస్‌తో ఓ సినిమా, ఆ తరువాత ఎన్టీఆర్‌తో మరో సినిమా తీస్తున్నాడని. ఎక్కువగా తెలుగు హీరోలతోనే తీస్తున్నాడనేది కన్నడిగుల కంప్లైంట్. ఏం.. కేజీఎఫ్-1, 2 ఇచ్చారుగా సరిపోదా అంటే.. సరిపోదట. ఆ ట్రోలింగ్ తట్టుకోలేక సోషల్ మీడియా నుంచే పూర్తిగా బయటికొచ్చారు. ఈమధ్య మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దులో ఏ కారణంగా గొడవ జరిగిందో తెలుసు మనందరికి. మహారాష్ట్రకు వెళ్తున్న కర్నాటక బస్సులోని కండక్టర్.. ప్రయాణికులకు మరాఠీలో సమాధానం ఇవ్వలేకపోయాడు....
