Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు ఇక పండగే.. 100కు పైగా వందే భారత్ రైళ్లను నడిపేందుకు మోడీ సర్కార్ ప్లాన్..

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు ఇక పండగే.. 100కు పైగా వందే భారత్ రైళ్లను నడిపేందుకు మోడీ సర్కార్ ప్లాన్..
Vande Bharat
Follow us

|

Updated on: Mar 16, 2023 | 7:21 PM

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పలు ప్రాంతాల మధ్య పరుగులు తీస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో సెమీహైస్పీడ్ రైళ్లను తీసుకువచ్చిన భారతీయ రైల్వే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రజలకు మరిన్ని శుభవార్తలు చెప్పేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకు 10 సర్వీసులను నడుపుతున్న భారతీయ రైల్వే.. దేశంలో మరిన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు రైళ్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. దీంతోపాటు సెమీ-హై స్పీడ్ రైలు 102 బోగీల ఉత్పత్తిని పెంచాలని ఇండియన్ రైల్వేస్ సూచించింది. భారతీయ రైల్వే రూపకల్పన ప్రకారం.. 102 యూనిట్ల వందే భారత్ రేక్‌లు (భోగిలు) ఉత్పత్తి కానున్నాయి. 2022–2023 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలో వివిధ కోచ్‌లతో సహా వందే భారత్ రైళ్లను అందించే బాధ్యతను PH 21–రోలింగ్ స్టాక్ ప్రాజెక్ట్ కోసం రూ.19479 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ అంచనా ప్రకారం.. 2022-2023లో 35, వచ్చే ఆర్థిక ఏడాది 2023-2024లో 67 ట్రైన్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక చేసింది.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు. న్యూఢిల్లీ – వారణాసి మధ్య ఫిబ్రవరి 15, 2019 నుంచి మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం, భారతీయ రైల్వే (IR) నెట్‌వర్క్‌లో 10 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లు సేవలందిస్తున్నాయని తెలిపారు. వైష్ణవ్ మాట్లాడుతూ, “మొత్తం 75 వందే భారత్ రేక్‌లను చైర్ కార్ వెర్షన్‌గా ప్లాన్ చేశారు. మిగిలినవి స్లీపర్ వెర్షన్‌గా ప్లాన్ చేశారు. ఐఆర్ మూడు విభిన్న సాంకేతికతలతో కూడిన 400 వందే భారత్ రైళ్లను (స్లీపర్ వెర్షన్) తయారు చేయడానికి కూడా రైల్వే ప్లాన్ చేసింది. వీటి కోసం టెండర్లు ఎంపిక చేశాం.. పేర్కొన్న వాటికి అదనంగా, 8000 వందే భారత్ కోచ్‌లు కూడా బడ్జెట్ 2023-24 కింద ప్రతిపాదించాం. రైల్వే నెట్‌వర్క్‌ను కవాచ్‌తో క్రమంగా కవర్ చేయాలని ప్రతిపాదించాం.. ప్రస్తుతం, దక్షిణ మధ్య రైల్వేలో 1455 కిలోమీటర్ల మార్గంలో కవాచ్ అమలు చేస్తున్నాం” అంటూ వైష్ణవ్ వెల్లడించారు.

ఇంకా, భారతీయ రైల్వేలోని ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా సెక్షన్లలో సుమారు 3000 రూట్ కిమీల కవాచ్ పనులకు కాంట్రాక్టులు ఇచ్చామని.. పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం, దక్షిణ మధ్య రైల్వేలో 1455 రూట్ కిలోమీటర్లలో కవాచ్ అమలు చేస్తున్నామన్నారు. ఇంకా, భారతీయ రైల్వేలలోని ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా విభాగాలలో దాదాపు 3000 రూట్ కి.మీల కవాచ్ పనులకు కాంట్రాక్టులు ఇచ్చానమిన తెలిపారు. రైల్ కార్గోను నిర్వహించడానికి అదనపు టెర్మినల్స్ అభివృద్ధితోపాటు పరిశ్రమ నుంచి పెట్టుబడిని పెంచడానికి, కొత్త గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినల్ (GCT) విధానం డిసెంబర్ 15, 2021న ప్రారంభించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ టెర్మినల్స్ నాన్-రైల్వే భూమిలో, అలాగే పాక్షికంగా లేదా పూర్తిగా రైల్వే భూమిలో నిర్మించనట్లు తెలిపారు. మూడు ఆర్థిక సంవత్సరాల్లో 2022-23, 2023-24, 2024-25లో 100 గతి శక్తి కార్గో టెర్మినల్స్ (GCTలు) కమీషన్ చేయడమే లక్ష్యమని తెలిపారు. వీటిలో 30 GCTలు ఇప్పటికే కమీషన్ చేశామన్నారు. జిసిటి విధానంలో కార్గో టెర్మినల్స్ అభివృద్ధికి ఇప్పటి వరకు 145 దరఖాస్తులు రాగా, 103 సూత్రప్రాయ అనుమతులు జారీ అయినట్లు రైల్వే మంత్రి వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?