Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో కాస్త తేడాగా కనిపించిన నౌక.. నేవీ అధికారులు వెళ్లి చెక్ చేయగా..

పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఓ నౌక అనుమానాస్పదంగా కనిపించింది..దీంతో వెంటనే.. భారత నావికాదళం రంగంలోకి దిగింది.. అసలేం జరుగుతోంది.. ఆ నౌకలో ఏమున్నాయ్.. ఎవరు ప్రయాణిస్తున్నారు.. ఇవన్నీ తెలుసుకునేందుకు భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్ INS తర్కాష్ కమాండోలు ఆపరేషన్‌ను ప్రారంభించాయి.. నౌకను ఆధీనంలోకి తీసుకోని తనిఖీ చేయగా..

సముద్రంలో కాస్త తేడాగా కనిపించిన నౌక.. నేవీ అధికారులు వెళ్లి చెక్ చేయగా..
Indian Navy Seizes 2,500 Kg Narcotics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 02, 2025 | 6:09 PM

పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఓ నౌక అనుమానాస్పదంగా కనిపించింది..దీంతో వెంటనే.. భారత నావికాదళం రంగంలోకి దిగింది.. అసలేం జరుగుతోంది.. ఆ నౌకలో ఏమున్నాయ్.. ఎవరు ప్రయాణిస్తున్నారు.. ఇవన్నీ తెలుసుకునేందుకు భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్ INS తర్కాష్ కమాండోలు ఆపరేషన్‌ను ప్రారంభించాయి.. నౌకను ఆధీనంలోకి తీసుకోని తనిఖీ చేయగా.. భారీగా డ్రగ్స్ పట్టుబడటంతోపాటు.. దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.. భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్ INS తర్కాష్ పశ్చిమ హిందూ మహాసముద్రంలో 2,500 కిలోలకు పైగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. మార్చి 31న కొన్ని నౌకల అనుమానాస్పద కదలికలపై నావికాదళానికి సమాచారం అందిన తర్వాత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించినట్లు వారు తెలిపారు. సమీపంలోని అన్ని అనుమానాస్పద నౌకలను క్రమపద్ధతిలో తనిఖీలు చేశారు. P8I మెరైన్ నిఘా విమానం, ముంబైలోని మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్‌తో సమన్వయంతో చేసిన ప్రయత్నాల కారణంగా.. INS తార్కాష్ ఒక అనుమానిత నౌకను అడ్డుకుని తనిఖీలు చేపట్టగా.. ఈ గుట్టు బటయపడినట్లు నేవీ ప్రతినిధి తెలిపారు.

అదనంగా, అనుమానాస్పద నౌక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర నౌకలను గుర్తించడానికి ఓడ తన సమగ్ర హెలికాప్టర్‌ను ప్రయోగించిందని ఆయన చెప్పారు. 2,500 కిలోల మాదకద్రవ్యాలను భారత నావికాదళం స్వాధీనం చేసుకుంది.. మార్చి 31న కొన్ని నౌకల అనుమానాస్పద కదలికలపై నావికాదళానికి సమాచారం అందిన తర్వాత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

మెరైన్ కమాండోలతో కలిసి ఒక స్పెషలిస్ట్ బోర్డింగ్ బృందం అనుమానిత నౌకలోకి ప్రవేశించి, క్షుణ్ణంగా తనిఖీ చేసి, వివిధ సీలు చేసిన ప్యాకెట్లను కనుగొన్నట్లు అధికారి తెలిపారు. తదుపరి సోదాలు, విచారణలో నౌకలోని వివిధ కార్గో హోల్డ్‌లు, కంపార్ట్‌మెంట్లలో నిల్వ చేయబడిన 2,500 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు (2,386 కిలోల హషీష్, 121 కిలోల హెరాయిన్‌తో సహా) బయటపడినట్లు ఆయన చెప్పారు.

సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఈ ఏడాది జనవరిలో ఐఎన్‌ఎస్‌ తర్కాష్‌ను మోహరించిన సంగతి తెలిసిందే. ఇటీవల సముద్రంలో భారత నావికా దళం, తీర భద్రతా దళాలు డ్రగ్స్‌పై జరిపిన దాడుల్లో ఇది తాజాదని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..