AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2050 కి భారత్ లో నీళ్లు దొరకవు.. సంచలన విషయాలు వెల్లడించిన యూనెస్కో

నీరు ప్రతి ఒక్క జీవికి జీవనాధారం. అవి లేకపోతే ఏ ప్రాణి జీవించలేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నీరు దొరక్క ప్రజలు అవస్థలు పడుతూ ఉంటారు.

2050 కి భారత్ లో నీళ్లు దొరకవు.. సంచలన విషయాలు వెల్లడించిన యూనెస్కో
Water
Aravind B
|

Updated on: Mar 23, 2023 | 11:07 AM

Share

నీరు ప్రతి ఒక్క జీవికి జీవనాధారం. అవి లేకపోతే ఏ ప్రాణి జీవించలేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నీరు దొరక్క ప్రజలు అవస్థలు పడుతూ ఉంటారు. నీటి కోసం కిలోమీటర్లు దూరం నడవడం, బావిలో నుంచి అడుగున ఉన్న నీటిని తోడుకోవడం లాంటి ఘటనలు ఎన్నో చూశాం. అలాగే వేసవి కాలంలో కూడా చాలామంది నీరు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి తరుణంలో యునెస్కో మరింత ఆందోళన కలిగించే విషయాలు బయటపెట్టింది. 2050 నాటికి భారతదేశం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటుందని యూనైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్ మెంట్ అనే నివేదికలో వెల్లడిచింది. ప్రపంచ పట్టణ జనాభా రోజురోజుకు పెరుగుతోంది. 2016లో దాదాపు 93 కోట్ల మంది నీటి కొరతను ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి ఈ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. అయితే 2050 నాటికి ఈ సంఖ్య 170 కోట్ల నుంచి 240 కోట్ల వరకు చేరుకుంటుంది.దీనివల్ల భారత్ తీవ్రంగా నీటి ప్రభావాన్ని చవిచూస్తుందని పేర్కొంది.

ప్రపంచ నీటి సమస్యను నివారించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని యూనెక్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రీ ఆజూలై తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని యునెస్కో తన నివేదికలో తెలిపింది. దాదాపు ఆసియాలోనే 80 శాతం మంది నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని… ముఖ్యంగా చైనాలోని ఈశాన్య ప్రాంత ప్రజలు, భారత్, పాకిస్థాన్ ప్రజలు ఎక్కువగా నీటి ఇబ్బందులతో అవస్థలు పడుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 153 దేశాలు దాదాపు 93 నదులు, సరస్సులు, జలాశయ వ్యవస్థలను పంచుకుంటున్నాయి. అందులో సగానికి పైగా ఒప్పందం చేసుకున్నవే ఉన్నాయని ఆ నివేదిక చిఫ్ ఎడిటర్ రిచార్డ్ కాన్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో కచ్చితంగా ప్రపంచం నీటి కొరతను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఈ ఆందోనలు నివారించేందుకు ప్రపంచ దేశాలు సరిహద్దుల మధ్య సహాకారాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..