కుమారుడి జ్ఞాపకార్థం సమాధిపై క్యూఆర్ కోడ్ ఉంచిన తల్లిదండ్రులు

కన్నబిడ్డలు వయసు నిండకుండానే మధ్యలో చనిపోతే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. చాలా రోజుల పాటు వారి జ్ఞాపకాల్లోనే మునిగిపోతారు.

కుమారుడి జ్ఞాపకార్థం సమాధిపై క్యూఆర్ కోడ్ ఉంచిన తల్లిదండ్రులు
Qr Code
Follow us

|

Updated on: Mar 23, 2023 | 10:10 AM

కన్నబిడ్డలు వయసు నిండకుండానే మధ్యలో చనిపోతే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. చాలా రోజుల పాటు వారి జ్ఞాపకాల్లోనే మునిగిపోతారు. అయితే కేరళలో కూడా ఓ వ్యక్తి మరణించడం ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ అనే యువకుడు వైద్యునిగా పనిచేసేవాడు. రెండేళ్ల క్రితం సరదాగా బాడ్మింటన్ ఆడుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 26 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందాడు. కానీ వైద్యనిగా అతని సృజనాత్మకత మాత్రం సజీవంగా ఉండిపోయింది. ఇవిన్‌ తల్లిదండ్రులు త్రిసూర్‌లోని చర్చి వద్ద తమ కుమారుడి సమాధి రాయిపై ఓ క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకాలను పదిలంగా ఉంచారు.

ఆ క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఇవిన్‌కు సంబంధించిన వీడియోలను చూసి అతని సృజనాత్మకతను, ప్రతిభను అందరూ తెలుసుకునేందుకు ఈ ఏర్పాటు చేశారు. వైద్య రంగంలో ఇవిన్‌ ప్రతిభను చాటే వీడియోలతో ఆయన కుటుంబం ఓ వెబ్‌పేజీని రూపొందించి ఆ క్యూఆర్‌ కోడ్‌కు లింక్‌ చేయడంతోనే ఇది సాధ్యమైంది. డాక్టర్‌ ఇవిన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలిచేలా చూసేందుకే ఆయన సమాధిపై క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేశామని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..