Viral Video: మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం.. సీన్ కట్‌చేస్తే.. షాకిచ్చిన పోలీసులు.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా గల్షాహీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే గూడ్స్ గోదాం సమీపంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో రచ్చ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా గల్షాహీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే గూడ్స్ గోదాం సమీపంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో రచ్చ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు యువకులు మద్యం మత్తులో యూపీ డయల్ 112 బొలెరోపై ఎక్కి వీరంగం సృష్టించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు యువకులు యూపీ 112 బొలెరోపై ఎక్కి రచ్చ చేశారు.
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న గల్షాహీద్ పోలీసులు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు సెక్షన్ 151 కింద చలాన్ విధించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇద్దరిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరింది. ఆ తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చి సదరు యువకులు సల్మాన్, మేరాజ్‌లను అరెస్టు చేసినట్లు ఎస్‌ఎస్‌పీ హేమ్‌రాజ్ మీనా తెలిపారు.
వీడియో వైరల్ కావడంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు..
➡️मुरादाबाद: यूपी डायल 112 की गाड़ी बनी मजाक
➡️2 युवकों का गाड़ी पर बैठकर घूमने का वीडियो
➡️डबल फाटक इलाके का वायरल हो रहा वीडियो
➡️पुलिस ने आरोपियों पर मामूली धारा में कार्रवाई की
➡️गलशहीद इलाके के डबल फाटक का वायरल वीडियो।@Uppolice @moradabadpolice pic.twitter.com/Rpt7q2eaOO
— TV9 Uttar Pradesh (@TV9UttarPradesh) March 22, 2023
మరోవైపు, మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించి వైరల్ వీడియోను SSP మొరాదాబాద్ హేమ్‌రాజ్ మీనా కంటపడింది. సోషల్ మీడియా ద్వారా ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం షేర్ చేస్తూ.. పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో అది యూపీ 112కి చెందిన గల్‌షహీద్ పోలీసుల కారు అని, దానిపై ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కూర్చున్నట్లు గుర్తించారు. పోలీసులు వారిద్దరినీ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దీంతో ఇద్దరిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..