AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: మార్కెట్‌లో అమ్మడవుతున్న నకిలీ స్మార్ట్‌ఫోన్‌లు.. నిజమైనదా..? కదా.. గుర్తించడం ఎలా?

నకిలీ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయి. ఇది భారత్‌లోనే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్..

Tech Tips: మార్కెట్‌లో అమ్మడవుతున్న నకిలీ స్మార్ట్‌ఫోన్‌లు.. నిజమైనదా..? కదా.. గుర్తించడం ఎలా?
Smartphones
Subhash Goud
|

Updated on: Mar 22, 2023 | 8:06 PM

Share

నకిలీ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయి. ఇది భారత్‌లోనే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో వినియోగదారులకు తెలియకుండానే ఇలాంటి మోసాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల, నోయిడాలో తక్కువ ధరలకు నకిలీ ఐఫోన్ 13 ఫోన్‌లను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 60కి పైగా నకిలీ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో కేవలం రూ.12వేలకు ఫోన్‌ను కొనుగోలు చేసి చైనా షాపింగ్ వెబ్‌సైట్‌లో ఐఫోన్‌ను పోలిన బాక్స్‌ను ఆర్డర్ చేసి దానిపై యాపిల్ స్టిక్కర్‌ను అతికించి విక్రయించాడు. అందుకే మీ స్మార్ట్‌ఫోన్ నిజమైనదో లేదా నకిలీదో తెలుసుకోండి ఇలా.

IMEI నంబర్: అన్ని ఒరిజినల్ స్మార్ట్‌ఫోన్‌లు IMEIని కలిగి ఉంటాయి. మీ ఫోన్ అసలైనదో లేదా నకిలీదో తెలుసుకోవడానికి ఇదే సులభమైన మార్గం. మీరు అనేక విధాలుగా కూడా IMEI నంబర్‌ని తనిఖీ చేయవచ్చు. ఇది మీ మొబైల్ బాక్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. మీరు స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌ల విభాగంలోకి వెళితే తెలుసుకోవచ్చు.

అలాగే ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#’కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. సెట్టింగ్‌లోకి వెళ్లి IMEI నంబర్ తెలుసుకోవచ్చు. అక్కడ ఈ నంబర్‌ కనిపించకపోతే మీ ఫోన్ ఫేక్ అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మీకు ఎలా చెక్ చేయాలో తెలియకపోతే, మీ సమీపంలోని మొబైల్ స్టోర్‌ని సందర్శించండి. వారు మీ ఫోన్‌ని రన్ చేస్తారు. అది నకిలీనా లేదా నిజమా అని తెలుసుకోవడంలో మీకు సహాయం చేస్తారు. మీరు ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, తక్కువ ధరకు మోసపోకండి. చాలా వరకు నకిలీ మొబైల్‌లు లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు తప్పుగా ఉంటాయి. నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి