PM Modi – Call Before U Dig App: ఇకపై ఇంటర్నెట్, పైప్‌లైన్‌కు నో ఫియర్.. ‘కాల్ బిఫోర్ యూ డిగ్’ యాప్ ప్రారంభించిన ప్రధాని మోదీ
సమాచారవిప్లవంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. 6G విజన్ డాక్యుమెంట్‌ను ఢిల్లీలో విడుదల చేశారు..
సమాచారవిప్లవంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. 6G విజన్ డాక్యుమెంట్‌ను ఢిల్లీలో విడుదల చేశారు. 2028-29 వరకు భారత్‌లో 6G సేవలు తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను మోదీ ప్రారంభించారు. 6G రీసెర్చ్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. దీనితో పాటు పీఎం మోడీ కాల్ బిఫోర్ యు డిగ్ మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు. ఈ యాప్ అంటే ఏమిటి..? ఇది ఎలా పని చేస్తుంది..? దీని గురించి తెలుసుకుందాం.
కాల్ బిఫోర్ యూ డిగ్ యాప్ అంటే ఏమిటి?
CBuD అంటే కాల్ బిఫోర్ యు డిగ్ అనేది టెలికాం డిపార్ట్‌మెంట్, కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ, భారత ప్రభుత్వం ప్రధాన మొబైల్ అప్లికేషన్. ఈ మొబైల్ యాప్‌ను తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏమిటంటే.. తవ్వకం పనిని ప్రారంభించే ముందు కేబుల్ (విద్యుత్ కేబుల్) లేదా వైర్ (టెలికాం కంపెనీ వైర్ మొదలైనవి) లేదా ఏ పైప్‌లైన్‌ను ఉపరితలం కింద అమర్చబడిందో తవ్వే కంపెనీలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇది తవ్వటానికి ముందు ఎలాంటి టెక్నాలజీ లేదు. దీని కారణంగా కంపెనీ వైర్, కేబుల్ లేదా పైప్‌లైన్ తవ్విన ఉపరితలం కింద ఉండటం వల్ల తరచుగా దెబ్బతింటుంది. దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
గతిశక్తి సంచార్ పోర్టల్ ప్రకారం.. CBuD మొబైల్ యాప్ ద్వారా ఎక్స్‌కవేటర్ లేదా డిగ్గింగ్ ఏజెన్సీ వారు తవ్వాలనుకుంటున్న ప్రాంతంలో ఉన్న భూగర్భ కేబుల్స్ మొదలైన వాటి గురించి సమాచారాన్ని పొందవచ్చు. దీనితో తవ్వడానికి వెళ్లే ప్రాంతంలో ఇప్పటికే కేబుల్ లేదా వైర్ భూగర్భంలో ఉన్న కంపెనీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, ఇతర వివరాలను పొందవచ్చు. ఈ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనం ఏంటంటే.. ఇప్పుడు డిగ్గింగ్ ఏజెన్సీ వారు తవ్వే ముందు వైర్ లేదా కేబుల్ అమర్చిన కంపెనీని సంప్రదించాలి. తద్వారా తవ్వే సమయంలో ఏదైనా నష్టాన్ని నివారించవచ్చు.
నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన వీడియోలో, ఏడాదిలో 10 లక్షల కేబుల్స్ నష్టం వాటిల్లిందని, దీని వల్ల 400 మిలియన్ డాలర్లు (సుమారు 3 వేల కోట్లు) నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దీనివల్ల నష్టంతో పాటు సామాన్య ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇన్నోవేషన్ సెంటర్‌ను, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు 5G సేవ క్రమంగా అందుబాటులోకి వస్తుండగా, 6G టెస్టింగ్ కూడా ప్రారంభించబడిందని ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలియజేశారు.
గ్లోబల్ సౌత్ సమిట్‌ను భారత్ విజయవంతంగా నిర్వహించిందన్నారు మోదీ. భారత్‌లో చాలామంది ప్రజలు కొత్త ఏడాది వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ శుభసమయంలో 6G రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మోదీ. అతితక్కువ ధరకే భారత్‌లో డేటా లభ్యమవుతోందన్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రజలే ఎక్కవగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని తెలిపారు. దేశంలో 2 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ సేవలు అందాయని చెప్పారు.
దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు కూడా బాగా పెరిగారని అన్నారు. భారత్‌లో ఇప్పటివరకు 350 పట్టణాల్లో 5 జీ సేవలు అందుబాటు లోకి వచ్చాయని, 5జీ సేవలు లాంచ్ చేసిన ఆరునెలలకే 6G సేవలపై దృష్టి పెట్టామని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి