Best Recharge Plans : మొబైల్ రీచార్జ్‌తోనే మరెన్నో ప్రయోజనాలు.. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్స్ ఇవే..

అన్ని కంపెనీలు కూడా జియో బాటలోనే నడుస్తున్నాయి. ముఖ్యంగా అన్‌లిమిటెడ్ రీచార్జి ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. అయితే అవి కూడా నెల నెలా కాకుండా 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుండడంతో అందరూ ఆయా ప్యాక్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు.

Best Recharge Plans : మొబైల్ రీచార్జ్‌తోనే మరెన్నో ప్రయోజనాలు.. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్స్ ఇవే..
Telecom
Follow us
Srinu

|

Updated on: Mar 22, 2023 | 4:30 PM

ప్రస్తుతం భారత్‌లో మొబైల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా టెలికాం మార్కెట్‌లోకి జియో రాకతో డేటా కూడా అందుబాటు ధరల్లో వినియోగదారులకు అందుతుంది. దీంతో అన్ని కంపెనీలు కూడా జియో బాటలోనే నడుస్తున్నాయి. ముఖ్యంగా అన్‌లిమిటెడ్ రీచార్జి ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. అయితే అవి కూడా నెల నెలా కాకుండా 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుండడంతో అందరూ ఆయా ప్యాక్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా నెలనెలా రీచార్జ్ టెన్షన్ లేకుండా చేసుకోవడానికి ఈ రీచార్జ్ చేసుకోడానికి వినియోగదారులు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఎయిర్‌టెల్, జియో, వీఐ కంపెనీలు 84 రోజుల వ్యాలిడీటీతో వచ్చే ప్యాక్స్ వివరాల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

84 వ్యాలిడిటీతో వచ్చే రీచార్జ్ ప్లాన్స్ ఇవే

జియో రూ. 666 ప్లాన్: ఈ ప్లాన్ 1.5జీబీ రోజువారీ డేటాతో మొత్తం 126జీబీ డేటాను అందిస్తుంది. వినియోగదారులకు అపరిమిత కాల్స్ వెసులుబాటు ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, వంటి జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌తో చేస్తుంది. ఈ ప్లాన్‌తో అర్హత ఉన్న కస్టమర్లకు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తుంది.

జియో రూ. 719 ప్లాన్: ఈ ప్లాన్‌లో వినియోగదారులు 2జీబీ రోజువారీ డేటా పొందుతారు. 5జీ యాక్సెస్‌తో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు జియో యాప్ సబ్‌స్క్రిప్షన్లు సేవలు వస్తాయి. ఈ ప్లాన్ కింద వినియోగదారులు మొత్తం 168 జీబీ డేటాను అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

జియో రూ. 1199 ప్లాన్: ఈ ప్లాన్‌తో, వినియోగదారులు 3జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు జియో యాప్‌ సబ్‌స్క్రిప్షన్‌ వస్తుంది.

ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే..

ఎయిర్‌టెల్ రూ. 455 ప్లాన్: ఈ ప్లాన్‌తో, వినియోగదారులు అపరిమిత కాలింగ్, 6జీబీ డేటా, 900 ఎస్ఎంఎస్, అపోలో 24×7, ఫాస్టాగ్ క్యాష్‌బ్యాక్, హలో ట్యూన్స్, వింక్ అదనపు ప్రయోజనాలను పొందుతారు.

ఎయిర్‌టెల్ రూ. 719 ప్లాన్: ఈ ప్లాన్ రోజువారీ 1.5జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఎయిర్‌టెల్ యాప్ నుంచి రీఛార్జ్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కి 3 నెలల ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది. అయితే మీరు ఎయిర్‌టెల్ 5జీ కవరేజ్ ఏరియాలో నివసిస్తుంటే, అపరిమిత 5జీ ఇంటర్నెట్‌ని ఆశ్వాదించవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 839 ప్లాన్: ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ 5జీ ప్రారంభించిన నగరాల్లోని వినియోగదారులకు అపరిమిత 5జీ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. అయితే మిగిలిన వినియోగదారుల కోసం ఈ ప్లాన్ రోజువారీ 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, డిస్నీ+ హాట్‌స్టార్‌కి ఉచిత సభ్యత్వం వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 999 ప్లాన్: ఎయిర్‌టెల్ వినియోగదారులు డేటా క్యాప్ లేకుండా 5జీ ప్రారంభించిన నగరాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించవచ్చు. అయితే, ఇతర వినియోగదారుల కోసం రోజువారీ 2.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు అమెజాన్ ప్రైమ్ ఉచిత సభ్యత్వం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

వీఐ ప్లాన్స్ ఇవే..

రూ. 719 ప్లాన్: ఈ ప్లాన్ రోజువారీ 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్, అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

రూ. 839 ప్లాన్: ఈ ప్యాక్ కింద వీఐ రోజువారీ 2 జీబీ డేటాను, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. వారాంతపు డేటా రోల్‌ఓవర్, రాత్రంతా బింగే వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

రూ. 1066 ప్లాన్: ఈ ప్యాక్ 2 జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, వీ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు