Recharge Plan: ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే ఏడాదంతా వ్యాలిడిటీ.. నెలకు రూ. 100 మాత్రమే. పూర్తి వివరాలు..

టెలికాం రంగంలో పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు పోటీపడీ మరీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సైతం రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్లను..

Recharge Plan: ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే ఏడాదంతా వ్యాలిడిటీ.. నెలకు రూ. 100 మాత్రమే. పూర్తి వివరాలు..
Recharge plan
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 17, 2023 | 10:00 AM

టెలికాం రంగంలో పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు పోటీపడీ మరీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సైతం రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు ఆకర్షణీయమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా ఏడాది వ్యాలిడిటీతో కూడిన మరో సూపర్‌ ప్లాన్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 1198తో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్‌తో యూజర్లు ఏడాది అంటే 12 నెలల వ్యాలిడిటీ పొందుతారు. ఏడాది పాటు వ్యాలిడిటీతో పాటు మరికొన్ని బెనిఫిట్స్‌ కూడా అందించారు. నెలకు రూ. 100 రీఛార్జ్‌ చేస్తే చాలు ఏడాదంతా వ్యాలిడిటీ పొందొచ్చు పొందొచ్చు. నెలకు 300 నిమిషాల కాలింగ్స్‌తో పాటు నెలకు 3జీబీ డేటా, నెలకు 30 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. తక్కువ ప్లాన్‌తో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది.

ఇక బీఎస్‌ఎన్‌ఎల్ దీంతో పాటు మరో ఆఫర్‌ను సైతం అందిస్తోంది. రూ. 2998తో రీఛార్జ్‌ చేసత్ఏ రోజుకు 3జీబీ డేటాతో పాటు 455 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. టెలికం సర్కిల్స్‌తో సంబంధం లేకుండా దేశంలోని అందరు బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు ఈ ఆఫర్‌ను అందిస్తోంది. డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌లు సైతం ఈ ప్లాన్‌ ద్వార పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..