భారీ ఆయుధాల కొనుగోలుకు సిద్ధమైన భారత్.. ఎన్ని వేల కోట్లంటే

దేశ రక్షణ కోసం ఆయుధాలు కొనేందుకు కొనేందుకు భారత్ సిద్ధమైంది. భారీ స్థాయిలో ఆయుధాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

భారీ ఆయుధాల కొనుగోలుకు సిద్ధమైన భారత్.. ఎన్ని వేల కోట్లంటే
Indian Defence
Follow us

|

Updated on: Mar 17, 2023 | 3:10 PM

దేశ రక్షణ కోసం ఆయుధాలు కొనేందుకు కొనేందుకు భారత్ సిద్ధమైంది. భారీ స్థాయిలో ఆయుధాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నౌకాదళం, సైన్యానికి అవసరమైన బ్రహ్మోస్‌ క్షిపణులు, శతఘ్ని వ్యవస్థలు, ఎలక్ట్రానిక్‌ యుద్ధ వ్యవస్థలు, హెలికాప్టర్లు తదితరాలను సేకరించేందుకు దాదాపు రూ.70,584 కోట్లు వెచ్చించనున్నారు.రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఆయుధ వ్యవస్థలన్నింటినీ దేశీయంగానే సమకూర్చుకోనున్నారు.

అయితే ఇందులో నేవీ ప్రతిపాదించిన ‘శక్తి’ ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు, సముద్ర గస్తీ హెలికాప్టర్లు, ఆయుధాలు, ఇతర పరికరాల విలువే దాదాపు రూ.56వేల కోట్ల మేర ఉంది. సైన్యం కోసం కొనుగోలు చేయనున్న వాటిలో కె-9 వజ్ర-టి, 155ఎంఎం/52 అటాగ్స్‌ శతఘ్నులు వంటి ఇతర ఆయుధాలున్నాయి. మెరైన్‌ డీజిల్‌ ఇంజిన్‌ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం లభించడం కీలకమైన అంశంగా రక్షణశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇటువంటి ఇంజిన్లను దేశీయంగానే అభివృద్ధిపరచి తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. తాజా ఆమోదంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సైనికాయుధాలు, పరికరాల కొనుగోళ్లకు రూ.2,71,538 కోట్ల వ్యయానికి ఆమోదం లభించినట్లైంది. ఈ మొత్తంలో 98.9శాతం నిధులను దేశీయ పరిశ్రమల నుంచి సేకరించేందుకే కేటాయించాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయంగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..