India Corona Updates: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

India Corona Updates: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఊరట కలిగిస్తోంది. గతంలో లక్షల్లో నమోదైన కేసులు..

India Corona Updates: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!
US Coronavirus
Follow us
Subhash Goud

|

Updated on: Jun 15, 2021 | 10:06 AM

India Corona Updates: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఊరట కలిగిస్తోంది. గతంలో లక్షల్లో నమోదైన కేసులు.. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 17,51,358 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో కొత్తగా 60,471 మందికి పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కరోనాతో 2,726 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 2,95,70,881 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3,77,031 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,82,80,472 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక 9,13,378 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగానే జరుగుతోంది. నిన్న 39,27,154 మందికి వ్యాక్సిన్‌ అందజేయగా, ఇప్పటి వరకు 25,90,44,072 మందికి కరోనా టీకా ఇచ్చారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. కరోనాను అంతం చేసేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.

కాగా, కరోనా కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. మాస్క్‌ ధరించకుండా బయటకు వెళ్లివారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మాస్క్‌ లేనివారికి భారీగా జరిమానా విధిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

New Covid Sensor: కొత్త కోవిడ్‌ సెన్సార్‌.. వాసన ద్వారా కోవిడ్‌ సోకిన వారిని గుర్తింపు

Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్‌.. టీకా తీసుకోండి.. కారు గెలుచుకోండి

Anti-Viral Coating: కొత్త టెక్నాలజీతో కరోనా వైరస్‌ను పోగొట్టేందుకు లిక్విడ్‌.. దుస్తులు, నేలపై వైరస్‌ మటుమాయం