Anti-Viral Coating: కొత్త టెక్నాలజీతో కరోనా వైరస్‌ను పోగొట్టేందుకు లిక్విడ్‌.. దుస్తులు, నేలపై వైరస్‌ మటుమాయం

Anti-Viral Coating: ప్రస్తుతం ఏడాదికిపైగా కరోనా మహమ్మారి దేశాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. శరీరంలో లోపలికి వెళ్లిన వైరస్‌ను..

Anti-Viral Coating: కొత్త టెక్నాలజీతో కరోనా వైరస్‌ను పోగొట్టేందుకు లిక్విడ్‌.. దుస్తులు, నేలపై వైరస్‌ మటుమాయం
New Anti Viral Coating
Follow us
Subhash Goud

|

Updated on: Jun 15, 2021 | 7:40 AM

Anti-Viral Coating: ప్రస్తుతం ఏడాదికిపైగా కరోనా మహమ్మారి దేశాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. శరీరంలో లోపలికి వెళ్లిన వైరస్‌ను అంతం చేసేందుకు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇక దుస్తులపై ఉండే వైరస్‌ నుంచి ఎలా రక్షించుకోవాలి అనే దానిపై లోక్‌ కవచ్‌ హెల్త్‌కేర్‌ ఒక లిక్విడ్‌ను తయారు చేసింది. యాంటీ వైరల్‌ కోటింగ్‌ (AVC) టెక్నాలజీతో కరోనా మహమ్మారి నుంచి రక్షిస్తుంది. తూరియా ఇన్వెస్ట్‌మెంట్స్‌ అనే కన్సెంల్టెంట్‌ కంపెనీ ఈ లిక్విడ్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఐరోపా, భారత్‌ ల్యాబ్స్‌లో ఈ ద్రావణం పనితీరు పరీక్షించారు. ఇందులో ఉన్న యాంటీ మైక్రోబయిల్‌ సొల్యూషన్‌ కారణంగా కేవలం బట్టలు ఉతికేందుకు కాకుండా నేలమీద శుభ్రపరిచేందుకు వినియోగించవచ్చు. ఈ సందర్భగా తూరియా ఇన్వెస్ట్‌మెంట్స్‌ సీఈఓ లూకే తల్వార్‌ మాట్లాడుతూ.. ఎన్నో అధ్యయనాల తర్వాత తగిన పరిణామాలతో యాంటీ వైరల్‌ కోటింగ్‌ టెక్నాలజీతో రూపొందించినట్లు చెప్పారు. మనుషులు వాడేందుకు ఎంతో సురక్షితమని వెల్లడించారు. ఒక కప్‌ లిక్విడ్‌తో నేల మొత్తాన్ని శానిటైజేషన్‌ చేయవచ్చని అన్నారు. ఇది సెకన్లలోనే 99.995 శాతం సామర్థ్యంతో పని చేస్తుందన్నారు. ఒకసారి శానిటైజ్‌ చేస్తే వారాల పాటు క్రిముల నుంచి దూరం ఉండవచ్చని తెలిపారు. కేవలం బట్టలపైన, నేల మీదే కాకుండా చెక్క టైల్స్‌, ప్లాస్టిక్‌ మీద ఉన్న వైరస్‌ నుంచి మనకు రక్షణ కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఇవీ కూడా చదవండి:

3D Printed Masks: కోవిడ్‌ వైరస్‌ అంతం చేసేందుకు సరికొత్త మాస్కులు వచ్చేశాయి.. త్రీడి టెక్నాలజీతో తయారీ

Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్‌.. టీకా తీసుకోండి.. కారు గెలుచుకోండి

New Covid Sensor: కొత్త కోవిడ్‌ సెన్సార్‌.. వాసన ద్వారా కోవిడ్‌ సోకిన వారిని గుర్తింపు