ప్రారంభం కాకుండానే కుప్ప కూలిన భారీ బ్రిడ్జ్

భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఎక్కడికక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో డ్యాం లు నిండిపోతున్నాయి. సియోనీ జిల్లాలో వైగంగా నది ఉధృతికి ఓ భారీ వంతెన..

ప్రారంభం కాకుండానే కుప్ప కూలిన భారీ బ్రిడ్జ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 30, 2020 | 4:51 PM

భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఎక్కడికక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో డ్యాం లు నిండిపోతున్నాయి. సియోనీ జిల్లాలో వైగంగా నది ఉధృతికి ఓ భారీ వంతెన కుప్పకూలింది. దీన్ని ప్రధానమంత్రి రూరల్ రోడ్  నెట్ వర్క్ కింద రూ. 3.7 కోట్ల వ్యయంతో 2018  సెప్టెంబరులో నిర్మించారు. ఈ ఆగస్టు 30 న ఈ బ్రిడ్జిని ప్రారంభించాల్సి ఉంది. అయితే 150 మీటర్ల పొడవున్న ఈ వంతెన నీటి ప్రవాహానికి కుప్పకూలింది. దీంతో సమీప గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు  తెగిపోయాయి.

సాక్షాత్తూ పీఎం రోడ్ నెట్ వర్క్ పథకం కింద నిర్మించిన ఈ వంతెన కూలిపోవడంతో మూడు కోట్ల రూపాయలకు పైగా పెట్టిన వ్యయం బూడిదలో పోసిన ‘నీళ్లయింది’. కాగా-మధ్యప్రదేశ్ తో బాటు బీహార్, అస్సాం రాష్ట్రాలు కూడా వరదలతో పోటెత్తుతున్నాయి. లక్షలాది ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.