ఆ మందులతో గుండెకు ముప్పు !

కరోనా వైరస్ బాధితులకు అపర సంజీవనిగా భావిస్తోన్న హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం దుష్ప్రభావం చూపుతుంతోంది, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందని తాజా అధ్యయనం తెలిపింది.

ఆ మందులతో గుండెకు ముప్పు !
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 8:26 PM

కరోనా వైరస్ బాధితులకు అపర సంజీవనిగా భావిస్తోన్న హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం దుష్ప్రభావం చూపుతుంతోంది, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందని తాజా అధ్యయనం తెలిపింది.

మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరో‌క్విన్, అజిత్రోమైసిన్‌లను కరోనా బాధితులకు ఉపయోగించి చికిత్సచేస్తున్నారు. మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరో‌క్విన్, అజిత్రోమైసిన్‌లను వాడుతున్నారు. అయితే, ఈ ఔషధాలను దీర్ఘకాలం వాడితో గుండె పోటుతో పాటు మరణాల ముప్పు ఎక్కువని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. విడిగా లేదా హెచ్‌‌సీక్యూ-అజిత్రోమైసిన్ కలిపి వాడటం వల్ల దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేలింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు స్వల్ప కాలం హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం వల్ల ఎటువంటి ముప్పు ఉండదని తేల్చారు.

హైడ్రాక్సీక్లోరో‌క్విన్, అజిత్రోమైసిన్‌లను కలిపి తీసుకున్న 3,20,000 మందికిపైగా బాధితులను పరిశీలించారు. దీర్ఘకాలం హెచ్‌సీక్యూ – అజిత్రోమైసిన్ వాడకం వల్ల గుండె సంబంధ మరణాల ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ చికిత్స వల్ల 15-20 శాతం మందిలో ఛాతీ నొప్పి, గుండె పనిచేయకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

మలేరియా, చర్మ సంబంధ వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటీస్ చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్ సాధారణంగా వాడతారు. కోవిడ్-19 ప్రారంభమైన తొలి నాళ్లలో దీనిని చికిత్సకు వైద్యులు సిఫార్సు చేశారు. కోవిడ్ చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌తో కలిసి వాడటం కలిగే దుష్ప్రభావం గురించి పెద్ద ఎత్తున అధ్యయనం నిర్వహించలేదని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ డేనియల్ ప్రిటో-అల్హాంబ్రా అన్నారు. అయితే ఈ రెండింటినీ కలిపి ఉపయోగించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.