Nitish Kumar: నా మాట వినండి.. ఇక లేట్ చేయొద్దు.. బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలను ఐక్యం చేసే పనిని కాంగ్రెస్ వెంటనే మొదలుపెట్టాలని నితీష్ పిలుపునిచ్చారు.. పాట్నాలో సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సుకు

బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలను ఐక్యం చేసే పనిని కాంగ్రెస్ వెంటనే మొదలుపెట్టాలని నితీష్ పిలుపునిచ్చారు.. పాట్నాలో సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సుకు నితీష్‌తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ప్రతిపక్ష నేతలంతా ఏకమవ్వాలన్నదే తన కల అని పేర్కొన్న నితీష్‌కుమార్.. ఇక కాంగ్రెస్ లేట్ చేయొద్దంటూ పేర్కొన్నారు. విపక్షాలు ఐక్యంగా పోటీ చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీకి 100 కంటే తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు నితీష్. విపక్షాలను ఐక్యం చేసే విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయవద్దంటూ సూచించారు. అలా చేస్తే అధికారాన్ని చేపట్టవచ్చంటూ తెలిపారు.
అయితే ప్రధాని పదవిపై తనకు మోజు లేదంటూ నితీశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో మార్పును కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. విపక్షాలు సమిష్టిగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఓకే అని అన్నారు. విపక్షాలను ఏకం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలి. భారత్ జోడో వంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన తర్వాత విపక్షాల ఐక్యత విషయంలో కాంగ్రెస్ తొందరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. విక్షాలు ఏకమైతే బీజేపీని ఓడించడం సాధ్యమే అన్నారు.
బీహార్‌లో ప్రతిపక్షాలు ఐక్యంగా పనిచేస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. నితీష్ పిలుపును అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఇదే సమావేశంలో బీజేపీపై విరుచుకునడ్డారు తేజస్వి యాదవ్. ప్రశ్నించిన విపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు తేజస్వియాదవ్. కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపై ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను పరగణలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలని సూచించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..