ఈ గురుడికి చోర కళ బాగా అబ్బింది.. విమానంలో వెళ్లి వాటిని మాత్రమే లూటీ చేస్తాడు.. ట్విస్ట్ ఏంటో తెలిస్తే..
Thiruvananthapuram News: జీవితంలో ఏదో ఒక కళ ఉండాలంటారు.. అందుకే ఈ గురుడు.. చతుష్షష్టి కళల్లో ఒకటైన చోర కళను ఎంచుకున్నాడు. దొంగతనం చేయడం ఒక ఆర్ట్ అని భావించి.. ఎవ్వరూ ఎంచుకోని మార్గాన్ని ఎంచుకున్నాడు.
Thiruvananthapuram News: జీవితంలో ఏదో ఒక కళ ఉండాలంటారు.. అందుకే ఈ గురుడు.. చతుష్షష్టి కళల్లో ఒకటైన చోర కళను ఎంచుకున్నాడు. దొంగతనం చేయడం ఒక ఆర్ట్ అని భావించి.. ఎవ్వరూ ఎంచుకోని మార్గాన్ని ఎంచుకున్నాడు. దీనికోసం ఎక్కడో ఖమ్మం నుంచి సూటుబూటు వేసుకుని బయలు దేరుతాడు.. హైదరాబాద్ చేరుకుని విమానంలో కేరళ వెళ్తాడు.. అక్కడ ఆటోల్లో రెక్కి నిర్వహించి.. రాత్రి సమయాల్లో ఇళ్లలో గుట్టుగా పనికానిచ్చేస్తాడు.. కేరళ పోలీసులకు చిక్కిన ఈ హైటెక్ దొంగ స్టోరీ చదివితే.. మీరు కూడా షాకవుతారు.. ఖమ్మం జిల్లాకు చెందిన ఉమాశంకర్.. దొంగతనాల విషయంలో విభన్న మార్గాన్ని ఎంచుకున్నాడు.. ఖమ్మం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటాడు.. ఆ తర్వాత విమానంలో వెళ్లి కేరళకు వెళ్తాడు. తిరువనంతపురం పట్టణంలో ఆటోలో తిరుగుతూ ఉదయం వేళ రెక్కి నిర్వహించి.. సాయంత్రం, రాత్రి వేళల్లో గూగుల్ మ్యాప్ సాయంతో తాళంవేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని చోరీలు చేస్తాడు. అయితే, ఈ దొంగలో మరో క్వాలిటీ కూడా ఉంది.. కేవలం బంగారు నగలను మాత్రమే చోరీ చేస్తాడని తిరువనంతపురం పోలీస్ కమిషనర్ సీహెచ్ నాగరాజు తెలిపారు.
బంగారు నగలను ఖమ్మం తీసుకెళ్లి తాకట్టు పెట్టేవాడని.. వివరించారు. హై ప్రొఫైల్ దొంగ ఉమాశంకర్ మొదట మే నెలలో పద్మనాభస్వామి ఆలయం సందర్శనకు వచ్చి ప్రణాళిక రచించాడని.. ఆ తర్వాత జూన్‌లో పలు ఇళ్లల్లో దొంగతనాలు చేశాడని.. మళ్లీ చోరీ చేసేందుకు వచ్చి చిక్కాడని తెలిపారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో హైటెక్ దొంగను పట్టుకున్నట్లు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..