Hyderabad: అత్తారింటి వేధింపులు తాళలేక అల్లుడు ఆత్మహత్య..!

కట్టుకున్న భార్య, అత్తామామల వేధింపులతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుషాయిగూడ ఎస్‌ఐ షేక్‌షఫీ తెలిపిన కథనం ప్రకారం..

Hyderabad: అత్తారింటి వేధింపులు తాళలేక అల్లుడు ఆత్మహత్య..!
Husband Suicide
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 06, 2023 | 10:38 AM

కుషాయిగూడ: కట్టుకున్న భార్య, అత్తామామల వేధింపులతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుషాయిగూడ ఎస్‌ఐ షేక్‌షఫీ తెలిపిన కథనం ప్రకారం..

కుషాయిగూడలోని పోచమ్మగుడి వద్ద మొలుగు వెంకట్‌రెడ్డి (38) తల్లి, భార్య కల్యాణి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ప్రైవేటుఉద్యోగి అయిన వెంకట్‌రెడ్డితో కలిసి అతని తల్లి ఉండటం అతని భార్య, అత్తమామలకు ఇష్టం లేదు. దీంతో వేరే కాపురం పెడదామని వారు నిత్యం వేధించసాగారు. దీంతో దంపతులమధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య అలిగి పిల్లలను తీసుకుని రెండునెలల క్రితం వరంగల్‌లో పుట్టింటికి వెళ్లింది.

ఈ క్రమంలో జులై 2న తల్లిదండ్రులను తీసుకుని కల్యాణి భర్త ఇంటికి నానా హంగామా చేసింది. అత్తను వెంటనే ఇంటి నుంచి పంపించేయాలని పట్టుబట్టింది. పైగా ఆస్తి అంతటిని పిల్లల పేరున రాయాలని ఒత్తిడి చేసింది. పరువు పోతుందని ఎంతచెప్పినా కల్యాణి వినలేదు. డ్రామాలాడకు నువ్వు చచ్చేవాడివేనా అంటూ హేళన చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వెంకట్‌రెడ్డి అదేరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లి గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు కుషాయిగూడ ఎస్‌ఐ షేక్‌షఫీ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎక్కడా తగ్గని ప్రధాని మోదీ.. అమెరికాకే అత్యంత ఖరీదైన బహుమతి
ఎక్కడా తగ్గని ప్రధాని మోదీ.. అమెరికాకే అత్యంత ఖరీదైన బహుమతి
14 రోజులు కోమాలో ఉన్న నాబిడ్డ.. కళ్లు తెరగానే ఆ హీరో పేరే తలిచాడు
14 రోజులు కోమాలో ఉన్న నాబిడ్డ.. కళ్లు తెరగానే ఆ హీరో పేరే తలిచాడు
పెంపుడు కుక్క మృతి.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న య‌జ‌మాని
పెంపుడు కుక్క మృతి.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న య‌జ‌మాని
సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా ??
సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా ??
కేవైసీ పేరుతో రూ.13 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..!
కేవైసీ పేరుతో రూ.13 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..!
హాట్‏నెస్‏కు కేరాఫ్ అడ్రస్.. గ్లామర్ ప్రపంచానికి యువరాణి..
హాట్‏నెస్‏కు కేరాఫ్ అడ్రస్.. గ్లామర్ ప్రపంచానికి యువరాణి..
ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై భారీ డిస్కౌంట్స్‌
ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై భారీ డిస్కౌంట్స్‌
భార్యతో విడాకుల రూమర్లు.. మద్యం మత్తులో చాహల్! వీడియో వైరల్
భార్యతో విడాకుల రూమర్లు.. మద్యం మత్తులో చాహల్! వీడియో వైరల్
24 వికెట్లు పడగొట్టి రచ్చ లేపిన మాజీ క్రికెటర్ తనయుడు
24 వికెట్లు పడగొట్టి రచ్చ లేపిన మాజీ క్రికెటర్ తనయుడు
మరో రెండు రోజుల్లో నయా ఫోన్ రిలీజ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు
మరో రెండు రోజుల్లో నయా ఫోన్ రిలీజ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు