- Telugu News Photo Gallery Khammam District: 1500 kg of fish died in Vedulla fish pond due to poisoning
ఖమ్మం: చేపల చెరువులో విషం కలిపిన దుండగులు.. వేలాది చేపలు, రొయ్యలు మృత్యువాత!
చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి...
N Narayana Rao | Edited By: Srilakshmi C
Updated on: Jul 05, 2023 | 3:24 PM

చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి.

వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న చేపలన్నీ చనిపోవడంతో ఆ చేపల చెరువు సొసైటీకి తీవ్ర నష్టం వాటిల్లింది.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని వేదుల్ల చేపల చెరువులో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు విష గుళికలు కలపడంతో దాదాపు 1500 కేజీల చేపలు మృత్యు వాత పడ్డాయి.

ఈ దారుణ ఘటన కారణంగా చేపల సొసైటీకు 75 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని చేపల సొసైటీ అధ్యక్షుడు శేషగిరి రావు ఆవేదన వ్యక్తం చేశారు.

తాను గత ఏడేళ్లుగా చేపల చెరువులో పెంపకం చేపడుతున్నామని, కొందరు గుర్తు తెలియని దుండగులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో 75 వేలు విలువైన చేపలు, రొయ్యలు చనిపోయినాయని, ఆ గుర్తు తెలియని వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేస్తున్నామని అన్నారు.





























