MP Urinating Case: వీడిని చెప్పుతో కొట్టినా తక్కువే..! గిరిజన యువకుడి ముఖంపై మూత్రవిసర్జన.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లోని సిద్ధి ప్రాంతంలో అమానుష చర్య చోటుచేసుకుంది. గిరిజన యువకుడి ముఖంపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్టు చేశారు. ఈ అనాగరిక చర్యకు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి ప్రాంతంలో అమానుష చర్య చోటుచేసుకుంది. గిరిజన యువకుడి ముఖంపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్టు చేశారు. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన నిందితుడిని బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అతని స్వగ్రామం కుబ్రిలో పట్టుబడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు ఓ పోలీసధికారి తెలిపారు. వివరాల్లోకెళ్తే..
భోపాల్‌లోని సిధిలోని బహ్రీ ప్రాంతంలోని కుబ్రి గ్రామానికి చెందిన నిందితుడు ప్రవేశ్ శుక్లా ఓ ఆదివాసీ వ్యక్తి ముఖంపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా పులువురు ఈ అమానుష చర్యను వ్యతిరేకిస్తూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గంటల వ్యవధిలోనే #ArrestPraveshShukla హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా హల్‌చల్ చేసింది. సభ్యసమాజం సిగ్గుపడేలా నీచమైన, హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని ముఖ్యమంత్రిని సోషల్ మీడియా వేదికగా కోరారు.
आदिवासियों के हितों की झूठी बात करने वाली भाजपा का नेता एक आदिवासी ग़रीब व्यक्ति के ऊपर इस तरह पैशाब कर रहा है। अति निंदनीय कृत्य।@ChouhanShivraj जी यह है आपका आदिवासी प्रेम?? इस जंगलराज को क्या कहें और भाजपा नेता की गिरफ़्तारी क्यूँ नहीं हुई ?
आरोपी का नाम प्रवेश शुक्ला बताया… pic.twitter.com/ZwgeaYza5R
— Abbas Hafeez (@AbbasHafeez) July 4, 2023
#WATCH | Sidhi viral video: Madhya Pradesh home minister Narottam Mishra says, “The accused (Pravesh Shukla) was arrested last night. He is in the lock up and strict action has been taken against him. CM Shivraj Singh Chouhan has said that NSA will be registered against him.… pic.twitter.com/KYq0ooRuaD
— TOI Cities (@TOICitiesNews) July 5, 2023
ఈ విషయం కాస్తా రాజకీయ రంగు పులుమకోవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘నిందితుడిని అరెస్టుకు ఆదేశించాం. ఎన్‌ఎస్‌ఏ విధించాలని అడ్మిన్‌ను ఆదేశించా’నన్నారు. నిందితుడు ప్రవేశ్ శుక్లాపై మంగళవారం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేసినట్లు డీఐజీ-రేవా మిథ్లేష్ శుక్లా తెలిపారు. బాధితుడు షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)కి చెందిన వ్యక్తిగా పోలీసులు ధృవీకరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.