‘నమ్మండీ.. నాకిదే తొలి పెళ్లి..’ నలుగురితో వరుస పెళ్లిళ్లు.. డబ్బుతో పరారై జల్సాలు

మాంగళ్య బంధాన్ని అపహాస్యం చేసిందో మహా ఇల్లాలు. నాకిదే మొదటి పెళ్లంటూ మాయమాటలు చెప్పి ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. మద్యం, సిగరెట్లకు బానిసైన ఈ నిత్యపెళ్లికూతురు కొన్ని రోజుల తర్వాత అదను చూసి ఇంట్లో బంగారం, డబ్బుతో ఉడాయించేది. ఈ మాయలేడీ మాయలో పడి..

'నమ్మండీ.. నాకిదే తొలి పెళ్లి..' నలుగురితో వరుస పెళ్లిళ్లు.. డబ్బుతో పరారై జల్సాలు
Woman Married 4 Men
Follow us
G Sampath Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Jul 04, 2023 | 4:40 PM

రామగుండం: మాంగళ్య బంధాన్ని అపహాస్యం చేసిందో మహా ఇల్లాలు. నాకిదే మొదటి పెళ్లంటూ మాయమాటలు చెప్పి ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. మద్యం, సిగరెట్లకు బానిసైన ఈ నిత్యపెళ్లికూతురు కొన్ని రోజుల తర్వాత అదను చూసి ఇంట్లో బంగారం, డబ్బుతో ఉడాయించేది. ఈ మాయలేడీ మాయలో పడి డబ్బు పోగొట్టకున్న ఓ యువకుడు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన రేవంత్‌కు అప్పటికే పెళ్లి జరిగి విడాకులయ్యాయి. పాన్‌షాప్‌ నడుపుతూ జీవనం సాగించే రేవంత్‌కు షాదీ డాట్‌ కామ్‌ ద్వారా వరంగల్‌కు చెందిన ఓ యువతి పరిచయమైంది. పరిచయం పెళ్లి వరకు వచ్చింది. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ఎన్టీపీసీలోని చిలుకలయ్య ఆలయంలో సాదాసీదాగా వివాహం జరిపించారు. కొత్త కాపురం ప్రారంభించిన కొన్ని రోజులకే మాయ లేడీ తన అసలు స్వరూపం బయటపెట్టింది. నిత్యం మద్యం, సిగరేట్లు కోసం భర్తను వేధించేది. దీంతో గత రెండు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన అక్క వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో దాచుకున్న రూ.70 వేల నగదు, 4 తులాల బంగారాభరణాలతో పరారైంది.

ఎన్ని రోజులైనా ఆమె తరిగిరాకపోవడంతో మోసపోయానని గ్రహించి ఆమె బంధువులను ఆరా తీయగా ఆమెకు అప్పటికే మూడు పెళ్లిలు అయ్యాయని తెలిసింది. ఆమె అడ్రస్‌ కనుక్కుని వెతుక్కుంటూ వెళ్లగా స్నేహితులతో విందు విలాసాలతో మునిగితేలుతోంది. రేవంత్‌ను చూసి స్నేహితులతో కలిసి అతనిపై దాడి, వీడియోలు తీశారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా అత్తమామల నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు. దీంతో రేవంత్‌ ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించి లబోదిబోమన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సదరు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.