Hyderabad: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పై పోలీసు స్టేషన్‌లో మాజీ మంత్రి వినోద్ పిర్యాదు.. కేసు నమోదు..

కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పై మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి తనయుడు మాజీ కాంగ్రెస్ మంత్రి గడ్డం వినోద్ కుమార్ కేసు పెట్టారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో మంత్రి వినోద్ కుమార్ పిర్యాదు చేశారు. 

Hyderabad: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పై పోలీసు స్టేషన్‌లో మాజీ మంత్రి వినోద్ పిర్యాదు.. కేసు నమోదు..
Cheque Bounce Case
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 04, 2023 | 12:02 PM

హైదరాబాద్, జూలై 07: రాజకీయ నేతల మధ్య ఏ గొడవ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఒకే పార్టీలో చాలా కాలం ఉన్న ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు ఆర్ధిక పొరపొచ్చలు తొంగిచూడటం సహజమే.. కానీ అది పోలీసు స్టేషన్ వెళ్లడం.. కోర్టు మెట్లు ఎక్కడం.. కేసులు నమోదు కావడం చాలా తక్కువగా జరుగుతుంటాయి. అంతా స్టేషన్ బయట సెటిల్ చేసుకుంటారు. ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణ నేతల మధ్య జరిగింది. ఇందులో ఒకరు రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న నాయకుడు ఒకరు.. రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్న నాయకుడు మరొకరు. ఇద్దరి మధ్య గత ఎన్నికల సమయంలో జరిగిన ఆర్ధిక లావాదేవీల వివాదం ఇప్పుడు మరింత హాట్ హాట్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పై మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి తనయుడు మాజీ కాంగ్రెస్ మంత్రి గడ్డం వినోద్ కుమార్ కేసు పెట్టారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో మంత్రి వినోద్ కుమార్ పిర్యాదు చేశారు.

తన నుంచి రూ. 25 లక్షల తీసుకొని చెల్లని చెక్ ఇచ్చినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు వినోద్ కుమార్. డబ్బులు తిరిగి ఇవ్వకుండా ప్రేమ్ సాగర్ రావు ఇబ్బందులు పెడుతున్నాడని పిర్యాదులో పేర్కొన్నారు వినోద్ కుమార్. ఇయితే ఇప్పటికే  మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై బ్యాంకు నుంచి చెక్ బౌన్స్ కేసులో ప్రేమ్ సాగర్ రావు కి కోర్టు నుంచి నోటీసులు నమోదు చేశారు.

గడ్డం వినోద్ చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.. గడిచిన ఎమ్మెల్యే ఎన్నికలలో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న వారిలో మొదటి లైన్ లో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం