ఎయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన బ్యాగ్..! కత్తితో కోసి చూడగా అడుగు భాగంలో..

ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా మాదక ద్రవ్యాలను కస్టమ్స్‌ అధికారులు సోమవారం (జులై 4) సీజ్‌ చేశారు. ఓ విదేశీ ప్రయాణికుడి బ్యాగ్‌ కింది భాగంలో దాదాపు రూ.13 కోట్ల విలువైన 1.3 కిలోగ్రాముల కొకైన్‌ను తరలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనలో ఓ మహిళ కూడా పట్టుబడింది..

ఎయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన బ్యాగ్..! కత్తితో కోసి చూడగా అడుగు భాగంలో..
Drugs In Bag
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 04, 2023 | 9:12 AM

ముంబై: ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా మాదక ద్రవ్యాలను కస్టమ్స్‌ అధికారులు సోమవారం (జులై 4) సీజ్‌ చేశారు. ఓ విదేశీ ప్రయాణికుడి బ్యాగ్‌ కింది భాగంలో దాదాపు రూ.13 కోట్ల విలువైన 1.3 కిలోగ్రాముల కొకైన్‌ను తరలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనలో ఓ మహిళ కూడా పట్టుబడింది. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు డ్రగ్స్‌ను బ్యాగ్‌ అడుగు భాగంలో కొకైన్‌ను దాచారు. అందులో ఓ మొబైల్‌ నంబర్‌ ఉండటంతో అధికారులు ఆ నంబర్‌కు కాల్ చేసి చాకచక్యంగా వ్యవహరించారు. సరుకు తీసుకునేందుకు తాము చెప్పిన చోటికి రావల్సిందిగా కోరారు. దీంతో సరుకు తీసుకునేందుకు రాగా అధికారులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. నిందితులి ఇద్దరి ఫోన్‌లోని డేటా ఆధారంగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.12.98 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.

మరోవైపు జూన్ 27 మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కస్టమ్స్ ‘సే నో టు డ్రగ్స్’ ప్రచారం కింద 8,946.263 కిలోల వివిధ రకాల నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మాదక ద్రవ్యాల్లో గంజాయి, హెరాయిన్, అల్ప్రాజోలం, ఎఫెడ్రిన్ హైడ్రోక్లోరైడ్, హైడ్రోక్లోరైడ్, మెథాక్వలోన్ వంటి తదితర మత్తుపదార్ధాలు ఉన్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతీయేట జూన్ 26న జరుపుకుంటారు. ఈ రోజున మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అధికారులు అవగాహన కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.