Hyderabad: ఆసుపత్రి సిబ్బంది చేతివాటం.. రూ.50 లక్షల డైమండ్ ఉంగరం చోరీ! భయంతో కమోడ్‌లో పడేసి ఫ్లష్
జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎమ్‌ఎస్ అనే డెంటల్ క్లినిక్‌లో రూ.50 లక్ష విలువైన వజ్రాల ఉంగరం చోరీకి గురైంది. నరేంద్ర కుమార్ అగర్వాల్ కోడలు జూన్ 27న క్లినిక్‌కి చెక్-అప్ కోసం వచ్చింది. చికిత్స సమయంలో ఆమె తన వేలికున్న డైమండ్ రింగ్ తీసి పక్కనే ఉన్న టేబుల్‌పై..
హైదరాబాద్: నగరంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు చేతివాటం చూపింది. చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ వద్ద రూ.50 లక్షల విలువైన డైమండ్ ఉంగరాన్ని కాజేసింది. ఆ తర్వాత పట్టుబడతానేమోననే భయంతో ఏమీ ఎరగనట్లు బాత్రూం కమోడ్‌లో పడేసి ఫ్లష్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎమ్‌ఎస్ అనే డెంటల్ క్లినిక్‌లో రూ.50 లక్ష విలువైన వజ్రాల ఉంగరం చోరీకి గురైంది. నరేంద్ర కుమార్ అగర్వాల్ కోడలు జూన్ 27న క్లినిక్‌కి చెక్-అప్ కోసం వచ్చింది. చికిత్స సమయంలో ఆమె తన వేలికున్న డైమండ్ రింగ్ తీసి పక్కనే ఉన్న టేబుల్‌పై ఉంచింది. ఐతే చెక్‌అప్ అనంతరం దానిని తీసుకోవడం మర్చిపోయి వెళ్లిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత క్లినిక్‌లో ఉంగరాన్ని మర్చిపోయిన సంగతి గ్రహించి క్లినిక్‌కి వెళ్లింది. ఉంగరం గురించి క్లినిక్‌లోని సిబ్బంది అడిగినా ఫలితం లేకపోయింది. పైగా పట్టిపట్టనట్లు యాజమన్యం ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నరేంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, సిబ్బందిని విచారించగా అసలు విషయం బయటపడింది.
క్లినిక్‌లో పనిచేస్తున్న ఓ నర్సు టిష్యూ పేపర్‌లో చుట్టిన ఉంగరాన్ని ఎవరో తన పర్సులోఉంచారని, దానిని చూడగానే భయంతో బాత్రూంలోని కమోడ్‌లో ఫ్లష్ చేశానని పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ప్లంబర్‌ను పిలిపించి కమోడ్‌కు అనుసంధానించి ఉన్న పైప్‌లైన్ నుంచి ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు సదరు మహిళా నర్సును అదుపులోకి తీసుకుని విచారించారు. టేబుల్‌పై నుంచి ఉంగరాన్ని దొంగిలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే ఊహించని రీతిలో పోలీసులు రంగంలోకి దిగడంతో భయాందోళనకు గురైన ఆమె పట్టుబడతామనే భయంతో దాన్ని టాయిలెట్‌లో పడేసి ఫ్లష్ చేసింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి కట్టుకథ అల్లిఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.