పెళ్లి కాని పురుషులు, మహిళలకూ నెలవారీ పింఛన్‌.. మరో నెల రోజుల్లో అమలు!

వృద్ధాప్య పింఛన్‌ మాదిరి అవివాహితులకు కూడా పింఛన్‌ ఇవ్వనున్నట్లు హర్యాణా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం (జులై 2) స్వయంగా ప్రకటించారు. కర్నాల్‌లోని..

పెళ్లి కాని పురుషులు, మహిళలకూ నెలవారీ పింఛన్‌.. మరో నెల రోజుల్లో అమలు!
Pension For Unmarried
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 03, 2023 | 2:54 PM

హర్యాణా: వృద్ధాప్య పింఛన్‌ మాదిరి అవివాహితులకు కూడా పింఛన్‌ ఇవ్వనున్నట్లు హర్యాణా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం (జులై 2) స్వయంగా ప్రకటించారు. కర్నాల్‌లోని కలంపుర గ్రామంలో జరిగిన ‘జన్ సంవాద్’ కార్యక్రమంలో ఖట్టర్ మాట్లాడుతూ.. 45 నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన అవివాహిత పురుషులు, మహిళలకు నెలవారీ పింఛన్‌ పథకాన్ని ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకానికి సంబంధించి మరో నెల రోజుల్లోపు అందుబాలోకి తీసుకువస్తామని ఆయన అన్నారు.

జన్‌ సంవాద్‌ కార్యక్రమంలో పాల్గొన్న 60 ఏళ్ల అవివాహిత వ్యక్తి తాను పింఛన్‌ దరఖాస్తు విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సీఎం ఖట్టర్‌కు విన్నవించాడు. దీనిపై సీఎం స్పందిస్తూ అవివాహితుల కోసం తమ ప్రభుత్వం పింఛన్‌ పథకాన్ని తీసుకువస్తున్నట్లు సీఎం ఖట్టర్‌ ఈ మేరకు తెలిపారు. ఐతే ఈ పథకం కింద ఎంత ఫించన్‌గా ఇస్తామనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం హర్యాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు వృద్ధాప్య పింఛన్‌ కూడా వచ్చే ఆరు నెలల్లో రూ.3000కు పెంచనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.