Supreme Court: సుప్రీంకోర్టులో ఇక నుంచి ఫ్రీ వైపై సేవలు..

సుప్రీంకోర్టులో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానంలో ఉచిత వైఫై సేవలు సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వెల్లడించారు.

Supreme Court: సుప్రీంకోర్టులో ఇక నుంచి ఫ్రీ వైపై సేవలు..
Supreme Court Of India
Follow us
Aravind B

|

Updated on: Jul 03, 2023 | 2:06 PM

సుప్రీంకోర్టులో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానంలో ఉచిత వైఫై సేవలు సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వెల్లడించారు. ఐదు కోర్టు గదుల్లో ఈ ఉచిత వైఫై సేవలు తెచ్చామని.. బార్ రూమ్స్‌లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని కోర్టు గదుల్లో కూడా ఈ సేవలు అందిస్తామని తెలిపారు. డిజిటైజేషన్ దిశగా ఇది ముందడుగు అని.. ఇక నుంచి లా కి సంబంధించిన పుస్తకాలు పేపర్లు కనిపించవన్నారు. అయితే తాము పుస్తకాలు, పేపర్లపై ఆధారపడబోమని అర్ధం కాదని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టులో ఇ-ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగానే ఈ ఉచిత వైఫై సేవలు ఏర్పాటు చేసినట్లు న్యాయస్థానం తెలిపింది. కోర్టుకు వచ్చే లాయర్లు, మీడియా వ్యక్తులు సహా ఎవరైనా ఈ సేవలు వినియోగించుకోవంచ్చని పేర్కొంది. ఇప్పుడు చీఫ్ జస్టీస్ కోర్టుతో సహా 2.3.4.5 కోర్టు గదుల్లో ఈ వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. అలాగే వీటితో పాటు కారిడర్, ప్లాజా, వెయిటింగ్ ఏరియా, క్యాంటిన్ సహా ప్రెస్ లాన్-1.2 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపింది. ఇదిలా ఉండగా వేసవి సెలవులు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు సోమవారమే పునఃప్రారంభమైంది

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం