భార్యను చంపి 2 రోజులపాటు ఫ్రిడ్జ్‌లో దాచిన భర్త.. అనారోగ్యంతో మృతి చెందిందని డ్రామాలు!
కట్టుకున్న భార్యను చంపి ఫ్రిడ్జ్‌లో రెండు రోజులపాటు దాచాడో భర్త. పైగా ఆమె అనారోగ్యంతో చనిపోయిందంటూ డ్రామాలాడాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఆదివారం (జులై 2) వెలుగుచూసింది...
భోపాల్: కట్టుకున్న భార్యను చంపి ఫ్రిడ్జ్‌లో రెండు రోజులపాటు దాచాడో భర్త. పైగా ఆమె అనారోగ్యంతో చనిపోయిందంటూ డ్రామాలాడాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఆదివారం (జులై 2) వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా జివులా గ్రామానికి చెందిన సుమిత్ర మిశ్రా (40), భరత్ మిశ్రా దంపతులు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. సుమిత్ర గత నెల 30వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందింది. ఐతే ఆమె మరణ వార్తను భర్త భరత్ మిశ్రా ఎవరికీ తెలపకుండా గుట్టుగా ఉంచాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని తమ ఇంట్లోని ఫ్రిజ్‌లో మూడు రోజులపాటు భద్రపరిచాడు. సుమిత్ర మృతి చెందిన విషయం జులై 2న తెలుసుకున్న ఆమె సోదరుడు అభిరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు భరత్ మిశ్రా ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా సుమిత్ర మృతదేహం ఫ్రిజ్‌లో కనిపించింది.
సుమిత్ర కామెర్ల కారణంగా గత శుక్రవారం (జూన్ 30) మృతి చెందిందని.. అంత్యక్రియలకు ముంబై నుంచి తన కొడుకు వస్తాడని.. అందుకే ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి ఉంచినట్లు పోలీసులకు తెలిపాడు. సుమిత్ర మృతిపై సోదరుడు అభిరాజ్ అనుమానాలు వ్యక్తం చేశారు. సుమిత్రను ఆమె భర్త భరత్ కొట్టి చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే ఆమె మృతికి గల అసలైన కారణం తెలుసుకునేందకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సింగ్ మీడియాకు తెలిపాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.