Chimanlal K Mehta: ప్రముఖ పారిశ్రామిక వేత్త సీకె మెహతా కన్నుమూత.. ‘ఓ శకం ముగిసింది’

రసాయనాల తయారీ కంపెనీ 'దీపక్ నైట్రేట్' వ్యవస్థాపకుడు, ఛైర్మన్ చిమన్‌లాల్ కె మెహతా సోమవారం ఉదయం (జులై 3) కన్నుమూశారు. మెహతా మరణం ఇండియన్‌ కెమికల్‌ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. గుజరాత్‌లోని అమ్రేలికి..

Chimanlal K Mehta: ప్రముఖ పారిశ్రామిక వేత్త సీకె మెహతా కన్నుమూత.. 'ఓ శకం ముగిసింది'
Chimanlal K Mehta
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 03, 2023 | 5:17 PM

గాంధీనగర్: రసాయనాల తయారీ కంపెనీ ‘దీపక్ నైట్రేట్’ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ చిమన్‌లాల్ కె మెహతా సోమవారం ఉదయం (జులై 3) కన్నుమూశారు. మెహతా మరణం ఇండియన్‌ కెమికల్‌ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. గుజరాత్‌లోని అమ్రేలికి చెందిన సీకే మెహతా రసాయన వాణిజ్య (కెమికల్ ఇండస్ట్రీ) పరిశ్రమలో 5 దశాబ్దాలకు పైగా బహుముఖ అనుభవంతో వ్యాపార రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. అందుకే ఆయనను మొదటి తరం వ్యవస్థాపకుడిగా పేర్కొంటారు. 1971లో దీపక్ నైట్రేట్‌ను స్థాపణకు, ట్రేడింగ్-తయారీలో తన నైపుణ్యాలతో ముఖ్యపాత్ర పోషించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 20 రెట్లు అధికలాభాలు అర్జించింది. ఆ సంస్థకు బలమైన పునాది వేసిన ఘనత ఆయనదే. ప్రస్తుతం ఆయన తర్వాత తరం సంస్థను నడిపిస్తున్నప్పటికీ, దీపక్ గ్రూప్‌కు చైర్మన్‌గా మార్గనిర్దేశం చేస్తోంది మాత్రం మెహతనే. ఆయన కుమారుడు మౌలిక్ మెహతా సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

సామాజిక మార్పులకు అతీతంగా సంస్థను ముందుకు నడపడంతో మెహతా మేటి. అనేక సీఎస్‌ఆర్‌ ప్రోగ్రామ్‌లను ప్రారంభించడంలో, దీపక్ ఫౌండేషన్‌ను స్థాపించడంలో మెహతా కీలకపాత్ర పోషించారు. గడచిన 40 ఏళ్లలో ఆరోగ్యం, విద్య, సాంఘిక సంక్షేమ రంగాలలో దేశవ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించారు. ఇండియన్‌ కెమికల్‌ ఇండస్త్రీ అభివృద్ధిలో మెహతా కృషి ప్రతిబింబిస్తుంది. ఇక దీపక్ నైట్రేట్ 100కి పైగా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వ్యవసాయ రసాయనాలు, రంగులు, రబ్బరు, ఫార్మాస్యూటికల్స్, స్పెషాలిటీ, ఫైన్ కెమికల్స్ వంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. రసాయన పరిశ్రమలో స్థానిక ఉత్పత్తిదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ కంపెనీ ఇటీవల లాభపడింది. బీఎస్‌ఈలో దీపక్ నైట్రేట్ షేర్లు 0.48 శాతం తగ్గి 2,163 వద్ద ట్రేడు కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.