Smart Rain Coat: వర్షాకాలంలో గుడ్‌న్యూస్.. మార్కెట్లోకి స్మార్ట్ రెయిన్ కోట్.. ధర కూడా చాలా తక్కువే..

వర్షాకాలం వచ్చిందంటే రెయిన్ కోట్ తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు మీరు రెయిన్ కోట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్య నుంచి మీకు ఉపశమనం కలిగించడానికి స్మార్ట్ రెయిన్ కోట్ సిద్ధంగా ఉంది. ఇది అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేయబడింది. ఇది వర్షాల సమయంలోనే మీ శరీర ఆకృతికి అనుగుణంగా సరిపోతుంది.

Smart Rain Coat: వర్షాకాలంలో గుడ్‌న్యూస్.. మార్కెట్లోకి స్మార్ట్ రెయిన్ కోట్.. ధర కూడా చాలా తక్కువే..
Smart Rain Coat
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 03, 2023 | 2:17 PM

వర్షాలు మొదలయ్యాయి. ఆఫీసుకు వెళ్తున్నప్పుడు.. స్కూల్‌కు వెళ్తున్న సమయంలో.. ఏదో పనిమీద బయటకు అడుగు పెట్టడంతోనే వర్షం.. అప్పటి వరకు అంతా కూల్.. ఒక్కసారిగా వర్షం. ఇలాంటి సమయంలో మనం ఓ పక్కకు బండిని నిలిపి రెయిన్ కోట్ తీసి వేసుకోవల్సి ఉంటుంది. అయితే ఇందంతా పెద్ద సమస్య.. ఓ కంపెనీ స్మార్ట్ రెయిన్ కోట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు వర్షాకాలంలో మీ రెయిన్ కోట్‌ను సులభంగా వేసుకోవచ్చు. ఇది యాప్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌తో జత చేయబడింది. ఈ స్మార్ట్ రైన్ కోట్ ఆటోమేటిక్ జిప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది వర్షం పడినప్పుడు స్వయంచాలకంగా.. అంటే మీ ప్రమేయం లేకుండానే మూసివేయబడుతుంది. ఇలా చేయాలని మీరు మీ మొబైల్ యాప్‌లో కమాండ్ ఇస్తే సరిపోతుంది. రెయిన్ కోట్ ఆటోమేటిక్‌గా మీ శరీరానికి సరిపోతుంది. ఇది మీకు సౌకర్యం, భద్రతను అనుభవించడంలో సహాయపడుతుంది.

ఈ స్మార్ట్ రెయిన్ కోట్ భారతదేశంలో అందుబాటులోకి ఇప్పటికైతే రాలేదు. ఇది ప్రస్తుతం చైనా మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. ఇది చైనా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ సేల్ అవుతున్నాయి. జనం భారీగా కొనుగోలు చేస్తున్నారు. దీని ధరపై మరిన్ని వివరాల కోసం, మీరు చైనీస్ మార్కెట్ కోసం సెర్చ్ చేయవచ్చు.

ఎలా పనిచేస్తుందంటే..

ఈ స్మార్ట్ రెయిన్ కోట్‌ను చైనాలో “రోబోటిక్స్” అని పెరు పెట్టారు. ఎందుకంటే మీరు చేయాల్సిందల్లా మీ శరీరానికి సరిపోయేలా చేయడం. వర్షం పడినప్పుడు, అది ఆటోమేటిక్‌గా శరీరానికి ముందు నుండి సెట్ చేసుకోవడం. చైనాలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఇది పురుషులతో పాటు పిల్లలు, మహిళల కోసం రెడీ చేశారు. ఇది ముఖ్యంగా పిల్లల కోసం రెయిన్ కోట్‌లో స్పేస్ బ్యాక్ కోసం స్థలాన్ని కూడా ఇచ్చారు. అంతేకుండా ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

స్మార్ట్ రైన్ కోట్ ధర

ఈ స్మార్ట్ రెయిన్ కోట్ ధర నిజంగా చాలా తక్కువగా ఉంది. దీని కారణంగా ఇది T-షర్ట్ కంటే చౌకగా చైనా మార్కెట్‌లో లభిస్తుండటంతో జనం నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది. అందుకే ఎవరైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ రెయిన్ కోట్‌ల ధర భారతీయ రూపాయలలో రూ. 400 నుంచి  రూ. 1000 రూపాయల మధ్య ఉంటుంది. ఇది చైనీస్ మార్కెట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం