గృహోపకరణాలపై ఏకంగా 75శాతం వరకూ తగ్గింపు.. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు మరెన్నో.. పూర్తి వివరాలు ఇవి..
Flipkart Big Bachat Dhamaal Sale: ఏకంగా 75శాతం వరకూ తగ్గింపును అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఒకవేళ మీరు ఫ్యాన్లు, కూలర్లు, ఎయిర్ ఫ్రైయర్స్, మైక్రోవేవ్స్, వాటర్ ప్యూరిఫైర్స్ వంటివి కొనుగోలు చేయాలంటే ఇదే మీకు మంచి అవకాశం.
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తో ముందుకొచ్చింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ దమాల్ సేల్ పేరిట ఈ సేల్ నడుస్తోంది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా అన్ని రకాల గృహోపకరణాలపై అద్బుతమైన ఆఫర్లు ఉన్నాయి. ఏకంగా 75శాతం వరకూ తగ్గింపును అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఒకవేళ మీరు ఫ్యాన్లు, కూలర్లు, ఎయిర్ ఫ్రైయర్స్, మైక్రోవేవ్స్, వాటర్ ప్యూరిఫైర్స్ వంటివి కొనుగోలు చేయాలంటే ఇదే మీకు మంచి అవకాశం. అంతేకాక హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్ వినియోగదారులకు ఈఎంఐ లావాదేవీలపై రూ. 5250 వరకూ అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్ జూలై మూడో తేదీ అర్థరాత్రి వరకూ అందుబాటులో ఉంటుంది.
ఆఫర్ పై లభిస్తున్న బెస్ట్ గృహోపకరణాలు ఇవే..
గృహోపకరణాలు రోజూ వారి జీవితంలో ప్రతి ఒక్కరికీ అవసరమే. ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ సేల్ ఓ గోల్డెన్ చాన్స్ అని చొప్పొచ్చు. ఇంట్లో బాగా ఉపయోగపడే వస్తువులు నమ్మశక్యం కానీ ధరలో లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ సేల్ మిస్ చేసుకోవద్దు. అతి తక్కువ ధరలకు లభిస్తున్న బెస్ట్ వస్తువులను మీకు పరిచయం చేస్తున్నాం ఓ లుక్కేయండి..
బజాజ్ 23ఎల్ కన్వెక్షన్ అండ్ గ్రిల్ మైక్రోవేవ్ ఓవెన్.. దీనిపై ఏకంగా 46శాతం డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఈ బజాజ్ మైక్రోవేవ్ ఓవెన్ అనేది బేకర్స్ కి పర్ ఫెక్ట్ ఎంపిక. ఇందులో కన్వెక్షిన్ అండ్ గ్రిల్ ఆప్షన్ కూడా ఉంది. దీనిలో ఐదు రకాల పవర్ లెవెల్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ధరలో రూ. 94,99గా ఉంది.
ప్రెస్టీజ్ అట్లాస్ 3.0 ప్లస్ ఇండక్షన్ కుక్ టాప్.. దీనిపై కూడా 43శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 1600వాట్ల సామర్థ్యం కలిగిన ఈ ఇండక్షన్ కుక్ టాప్ ధర ఫ్లిప్ కార్ట్ సేల్లో రూ. 1799గా ఉంది.
వోల్టాస్ ఏసీ.. 1.5టన్నుల 3 స్టార్ స్ల్పిట్ ఏసీపై ఏకంగా 51శాతం డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 69,999గా ఉన్న దీని ధర ఫ్లిప్ కార్ట్ సేలో కేవలం రూ. 33,999కే లభిస్తోంది. దీనిలో కాపర్ వైర్ తో పాటు ఆటో రీస్టార్ట్, స్లీప్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
పిజియాన్ ఫేవరెట్ జ్యూస్ మిక్సర్ గ్రైండర్.. దీనిపై ఏకంగా 63శాతం తగ్గింపు ఉంది. 500వాట్ల ఈ జ్యూస్ మిక్సర్ ధర కేవలం రూ. 1799. దీనిలో స్టైన్ లెస్ జార్స్, బ్లేడ్స్ ఉంటాయి.
శామ్సంగ్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్.. మీరు ఒకవేళ ఫ్రిడ్జ్ మార్చాలనుకుంటే మీకిదే బెస్ట్ ఆప్షన్. శామ్సంగ్ 183 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 4స్టార్ రిఫ్రిజిరేటర్ పై 27శాతం ఆఫ్ ఉంది. ఇది డిజిటల్ ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..