భార్య ఎక్కిన విమానం ఆలస్యమైందని ట్వీట్ చేసిన భర్త.. ఇండిగో ఏం చెప్పిందంటే
భారత విమానయాన సంస్థ ఇండిగోపై ఓ వ్యక్తి అసహనం వ్యక్తం చేశారు. పైలట్ అలసిపోవడం వల్ల తన భార్య వెళ్లాల్సిన విమానం దాదాపు మూడు గంటల పాటు ఆలస్యమైందని అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం ఆలస్యానికి సంబంధించి తన భార్యతో చేసిన వాట్సప్ చాటింగ్‌లను కూడా అతడు ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.
భారత విమానయాన సంస్థ ఇండిగోపై ఓ వ్యక్తి అసహనం వ్యక్తం చేశారు. పైలట్ అలసిపోవడం వల్ల తన భార్య వెళ్లాల్సిన విమానం దాదాపు మూడు గంటల పాటు ఆలస్యమైందని అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం ఆలస్యానికి సంబంధించి తన భార్యతో చేసిన వాట్సప్ చాటింగ్‌లను కూడా అతడు ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. అయితే ఈ ట్వీట్స్ వైరలయ్యాయి. ఇక చివరికి ఇండిగో విమానం స్పందించింది. ఆదివారం రోజున డెహ్రడూన్-చెన్నై విమానంలో ఈ ఘటన వెలుగుచూసింది. సమీర్ మోహన్ అనే వ్యక్తి తన భార్యకు కలిగిన అసౌర్యం గురించి వెల్లడించి.. ఈ విషయాన్ని పౌరవిమానయాన శాఖకు ట్యాగ్ చేశాడు. పైలట్ అలసిపోయారని.. అయితే అతని స్థానంలో మరో పైలట్‌ను భర్తీ చేసేందుకు అవకాశం లేనందువల్లే ఇలాంటి సంఘటన జరిగినట్లు అతని ట్వీట్లలో తెలిపాడు.
అలాగే ఆ విమానంలో ప్రయాణించిన మరో వ్యక్తి కూడా అందులోని వీడియోలు కూడా షేర్ చేశాడు. పైలట్స్ విమానాన్ని ఢిల్లీలో ల్యాండ్ చేశారని.. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్లు వెళ్లిపోయారని చెప్పారు. సిబ్బంది చాలా అలసిపోయి ఉన్నారని.. విమానాల నిర్హహణకు సంబంధించి ఇండిగోపై తీవ్రంగా విమర్శలు చేశాడు. ఆ తర్వాత దీనిపై స్పందించిన ఇండిగో ఆలస్యం వల్ల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. షెడ్యూల్ సమస్యల వల్లే ఈ ఆలస్యం జరిగిందని పేర్కొంది. ఈ సమయంలో ఓపికగా ఉన్నందుకు కృతజ్ఞతలు అని వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..