AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రైం థ్రిల్లర్‌కి మించిన స్కెచ్‌.. రెండేళ్ల కొడుకుని కిరాతకంగా చంపిన కన్నతల్లి!

హిందీ సినిమాలు చూసి ప్రేరణ పొంది కన్నబిడ్డని హతమార్చింది ఓ కసాయి తల్లి. ఆ తర్వాత కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ వాలకంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయట..

క్రైం థ్రిల్లర్‌కి మించిన స్కెచ్‌.. రెండేళ్ల కొడుకుని కిరాతకంగా చంపిన కన్నతల్లి!
Naina Mandavi
Srilakshmi C
|

Updated on: Jul 04, 2023 | 2:40 PM

Share

సూరత్‌: హిందీ సినిమాలు చూసి ప్రేరణ పొంది కన్నబిడ్డని హతమార్చింది ఓ కసాయి తల్లి. ఆ తర్వాత కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ వాలకంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఈ దారుణ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఛత్తీస్‌గఢ్‌లోని లేక్‌సిటీ రెసిడెన్సీ ప్రాజెక్ట్‌లో నివాసం ఉంటోన్న నైనా మాండవి (22) అనే మహిళకు నాలుగేళ్ల క్రితం భువనేశ్వర్‌తో వివాహం జరిగింది. భువనేశ్వర్‌ నిత్యం చిత్రహింసలకు గురిచేస్తుండటంతో భర్తకు విడాకులిచ్చి రెండేళ్ల క్రితం రెండు నెలల కొడుకు వీర్‌ను తీసుకుని సూరత్‌కు వచ్చింది. అక్కడే  రెండేళ్లుగా కూలి పనులు చేసుకుంటూ కుమారుడితో జీవనం సాగిస్తోంది. కుమారుడి పేరు వీర్‌ అలియాస్‌ భోండు. పని చేసే చోట సంజూ అనే కూలీతో నైనాకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఐతే సంజూని వివాహం చేసుకోవడానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి వదిలించుకోవాలని పథకం పన్నింది నైనా. గట్టుచప్పుడు కాకుండా కొడుకును హత్య చేసింది. అనంతరం తన కొడుకు కనిపించడం లేదంటూ జూన్ 27న దిండోలి పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు పెట్టింది.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. తల్లే బిడ్డను హత్య చేసి నాటకాలు ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు మహిళను పోలీసులు గత శనివారం (జులై 1) అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించింది. ఐతే పోలీసులు నిందితురాలు నైనా  కాలనీ వెనుక ఉన్న బహిరంగ ప్రదేశంలో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు చెప్పింది. ఆ ప్రదేశంలో తవ్వగా మృతదేహం కనిపించలేదు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. తాను క్రైం థ్రిల్లర్‌ సినిమాలు చూస్తుంటానని.. వాటిని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యి బిడ్డను గొంతుకోసి చంపి, మృతదేహాన్ని నీటితో నిండిన ఎలివేటర్ డక్ట్‌లో విసిరేనట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!