AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నీ తెలివి తెల్లార! ఇలా చేస్తే ఎవరూ కనిపెట్టలేరనుకుంది.. కట్ చేస్తే అడ్డంగా బుక్కైంది..

డ్రగ్స్ అక్రమ రవాణా నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లర్లలో ఏమాత్రం భయం, బెరుకు లేకుండా పోతోంది. ఓవైపు దొరికిపోతున్నా.. మరోవైపు నిరంతరం ప్లాన్స్‌ మారుస్తూ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు.

Hyderabad: నీ తెలివి తెల్లార! ఇలా చేస్తే ఎవరూ కనిపెట్టలేరనుకుంది.. కట్ చేస్తే అడ్డంగా బుక్కైంది..
Rgi
Shiva Prajapati
|

Updated on: Jul 04, 2023 | 6:02 AM

Share

డ్రగ్స్ అక్రమ రవాణా నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లర్లలో ఏమాత్రం భయం, బెరుకు లేకుండా పోతోంది. ఓవైపు దొరికిపోతున్నా.. మరోవైపు నిరంతరం ప్లాన్స్‌ మారుస్తూ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నైరోబి నుండి సార్జా మీదుగా ఎయిర్ అరేబియా విమానంలో ఓ మహిళ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అయితే.. ఆమె ప్రవర్తన కాస్త భిన్నంగా ఉండటంతో అధికారులు అనుమానించారు. ఆమెను అడ్డగించి తనిఖీలు చేశారు కస్టమ్స్‌ అధికారులు. దాంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె వద్ద భారీగా డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఆ డ్రగ్స్‌ను పట్టుకొచ్చిన విధానం చూసి అధికారులు షాక్ అయ్యారు.

బురండి దేశం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆమె.. ఆఫ్రికన్‌ దేశానికి చెందిన మూడు ఖరీదైన డ్రెస్సులు, హాండ్ బ్యాగ్, సోప్ కవర్స్లో డ్రగ్స్ తీసుకొచ్చింది. ఆ మహిళా ప్రయాణికురాలి నుంచి 2 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ ఆఫీసర్స్. కాగా, పట్టుబడిన డ్రగ్స్‌ విలువ సుమారు రూ. 14.40 కోట్లు ఉంటుందని వెల్లడించారు కస్టమ్స్ అధికారులు. డ్రగ్స్ తరలించేందుకు ఆమె వేసిన ఎత్తులను చూసి కస్టమ్స్ అధికారులే నివ్వరపోయారు. మొత్తంగా.. డ్రగ్స్‌తో పట్టుబడ్డ బురండీ దేశం నుంచి వచ్చిన మహిళపై కేసు నమోదు చేసి.. ఆమెను రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కస్టమ్స్‌ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్